పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య
నర్సంపేటలో పలు పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్.
వరంగల్/నర్సంపేట , 11 జూన్ 2024
అమ్మ ఆదర్శ పాఠశాల ల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ నర్సంపేట మండలంలోని రామవరం ఎంపీపీ ఎస్, నర్సంపేట ఎంపీపీఎస్, నర్సంపేట ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు గుర్తించి చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రూ. 24 కోట్ల వ్యయంతో సుమారు 556 ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, అందులో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పనులు తుది దశలో ఉన్నాయని వాటిని పాఠశాలల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు అందజేయడం జరిగిందని, మహిళా సంఘాల చే కుట్టిన ఏకరూప దుస్తులను పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి సెక్టోవల్ ఆఫీసర్ సుధీర్ ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ, ఆదర్శ కమిటీ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box