హైదరాబాద్ లో అమెరికా స్వాతంత్ర వేడుకలు -హాజరైన డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క భట్టి -



అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైనది 


అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేసింది


అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న భాష తెలుగు 


అమెరికా స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు

--++-----------

అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు

యునైటెడ్ స్టేట్స్ కాన్స్ లేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన యు.ఎస్ 248 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఘనంగా స్వాగతం పలికిన కాన్సిలేట్ జనరల్ జెన్నీ ఫర్ లార్సన్, యు.ఎస్ ఎంబర్సీ రేర్ అడ్మిరోల్.


యు.ఎస్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లారెన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా 248వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకర అంశంగా పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక అంశం, ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా చేసిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తానికి పండుగ అని తెలిపారు.  భారతదేశానికి వ్యూహాత్మకంగా కూడా అమెరికా మంచి మిత్ర దేశం అన్నారు. అమెరికా అతి ప్రాచీన, పెద్దదైన ప్రజాస్వామిక దేశమని అభివర్ణించారు. అమెరికా స్వాతంత్రం మూలంగానే మనం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, హక్కులను అనుభవిస్తున్నామన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాతో అవినాభావ సంబంధం ఉందన్నారు. మన సినిమా షూటింగులు అమెరికాలో ఎక్కువగా జరుగుతాయి, మన పిల్లలు ఉన్నత చదువులకు అమెరికాకు ఎక్కువగా వెళుతుంటారు, ఉన్నతమైన జీవితం కోసం అక్కడికి వెళుతుంటారు, అమెరికాలో ప్రస్తుతం అతివేగంగా విస్తరిస్తున్న భాష ఏదైనా ఉందా అంటే అది తెలుగు భాష మాత్రమేనని, రాబోయే రోజుల్లో తాను ఇలాంటి వేడుకల్లో తెలుగులోనే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి చెందేందుకు అమెరికా అండగా నిలిచిందన్నారు. భారతీయులను అమెరికన్లు సాదరంగా ఆహ్వానించి అక్కడి పౌరులుగా గౌరవ మర్యాదలు ఇస్తారని వారితో సమానంగా చూసుకుంటారని తెలిపారు. అమెరికా భారత్ మధ్య స్నేహం విషయానికొస్తే హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.   వ్యాపారం, సంస్కృతి వంటి విషయాల్లో తెలంగాణ అమెరికా మధ్య బలమైన బంధం ఉన్నది, ఇవి రోజుకు బలపడి రాబోయే రోజుల్లో హైదరాబాద్ అమెరికాల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడుతుందన్నారు. అటు భారత్ ఇటు అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం భారత్లో ఎన్నికలు ముగియగా రాబోయే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికల్లో అమెరికాల్లో మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు