నెల్లూరు జిల్లాలో ఘటన -నుజ్జు నుజ్జైన కారు ముందు భాగం
గాయపడిన పులి కోసం గాలిస్తున్న అటవి శాఖ అధికారులు
రోడ్డుపై వెళుతున్న కారును అడవి నుండి రోడ్డుపైకి వచ్చిన పులి ఢీ కొట్టింది. నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టిందని అఠవి శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. . బద్వేలుకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
పులి కారును ఢీ కొన్న సమయంలో కారు కూడ వేగంతో ఉంది. పులి కూడ వాగంగా వ్చచి ఢీ కొనడంతో కారు ముందు బాగం నుజ్జు నుజ్జు అయింది. కారు సడెన్ బ్రేక్ అప్లై చేసినా కంట్రోల్ కాక కొద్ది దూరం రోడ్డుపై పులిని రాక్కుంటూ వెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఆక్సిడెంట్ తర్వాత అక్కడే కదలలేని స్థితిలో ఉండి కాసేపటికి పులి అడవిలోకి వెళ్లి పోయిందని సమాచారం. అటవీ శాఖ అధికారులు ప్రమాదంపై ఆరా తీసి గాయపడిన పులికి వైద్యం చేసేందుకు అడవిలో గాలింపు చేపట్టారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box