సీన్ రివర్స్ - వైసిపి దారిలోనే ఇప్పుడు వారు చేస్తున్నారు

 

తన ఇంటిని కూల్చారని గుండు గీయించుకుని నిరసన తెలిపిన వైసిపి నేత జగదీష్

ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికల  ఫలితాల అనంతరం సీన్ రివర్స్ అయి వారు వీరు వీరు వారు అయ్యారు. మొన్నటి వరకు అప్పోజిషన్ లో టిడిపి, జనసేన ఇప్పుడు అధికార హోదాలో ఉన్నారు. వై.సి.పి  శ్రేణులు రెచ్చి పోయి టిడిపి, జనసేనపై జులుం కొనసాగించారన్న ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన  మరుసటి రోజు నుండే వై.ఎస్ఆర్ పార్టి జులుం కొనసాగింది. 

నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును  పట్టుకుని మాటలతో కన్నీరు పెట్టించారు. ఇక అసెంబ్లి  బయట అయితే వారి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. నోరు తెరిస్తే బూతులే బూతులు.  పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసుల్లో ఇరికించడం జైళ్లకు పంపించడం ఇంకా చాలానే చేసారు.

స్వయంగా చంద్రబాబును జనసేన నేత పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేసి ఆడుకున్నారు. సామాన్య కార్యకర్తలు అయితే వై.సి.పి  పార్టి మూకల ధాడికి విల విల లాడిపోయారు. 

ఇప్పుడు రాజకీ పరిస్థితులు  మారి సీన్ కాస్త  రివర్స్ అయింది.  భారి మెజార్టీతో చంద్రబాబు నాయుడు 164 సీట్లతో అధికారం చేపట్టారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే  టిడిపి వై.సి.పి  పార్టి పై ప్రతీకార దాడులకు పాల్పడిందని విమర్శలు వచ్చాయి. ఇవి ఇంకా పలు జిల్లాలలో  కొనసాగుతున్నాయి

అధికారంలో ఉండగా రెచ్చి పోయిన కొడాలి నాని భూకబ్ఝా చేశారంటూ  ఎన్నికల ఫలితాల అనంతరం ఆక్రమణలను ధ్వంసం చేశారు. అతని ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి. ఇదంతా వై.సి.పి  నేతలు చేసుకున్న పుణ్య ఫలితమని చెప్పి సమర్దించడం సరికాదు. వైసిపి మూకలు చేసిన  దాడులు దౌర్జన్యాలను మూర్ఖపు పనులను  తెలుగుదేశం పార్టి కొనసాగించిన్లు అవుతుంది కదా అనేది  సామాన్య ప్రజల నుండి వినిపిస్తున్న  టాక్.


మంగళగిరిలో వైసిపి నాయకుడిపై దాడి చేసి అతన్ని మోకాళ్లపై కూర్చో బెట్టి నారా లోకేష్ ఫోటోకు దండం పెట్టించారు. విజయవాడలో వైసిపి నేత నందేపు జ‌గ‌దీష్‌ ఇంటిని అట్లాగే వాణిజ్య సముదాయాన్ని అక్రమ కట్టడాలంటూ మున్సిపల్ అధికారులు కూల్చి వేసారు. ఇదంతా ఎమ్మెల్యే బొండా ఉమా చేయించాడని జగదీష్ గుండు గీయించుకుని నిరసన తెలిపాడు.

ఆక్రమాలు, అవినీతికి పాల్పడిన నేతలుంటే  చట్టపరగంగా చర్యలు తీసుకోవాలే గాని ఇలా ప్రతీ కార  దాడులు దౌర్జన్యాలకు వెళితే  కార్యకర్తలకు ఆనందం కలుగుతుందేమో కాని సామాన్య ప్రజలు ఇలాంటివి సహించరు.  ఇలాంటి పిచ్చి పనులు చేసిన  వై.సిపీకి రాష్ట్రంలో ప్రజలు ఏగతి పట్టించారనేది గుర్తించు కోవాలి..  

తెలుగుదేశం పార్టి, జనసేన ప్రతీకార దాడులకు దిగకుండా సంయమనంతో వ్యవహరించాలి. కాదు కూడదు ప్రతీకారం తీర్చుకుంటామంటే భవిష్యత్లో  ప్రజల నుండి వ్యతిరేకత తప్పదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు