తెలంగాణ ప్రాంత బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలి

 

అఖిలపక్షం ద్వారా ప్రధాన మంత్రిని కల్సి విజ్ఞప్తి చేస్తాం 
ఉపముఖ్య మంత్రి, ఇందన శాఖ మంత్రి  భట్టి విక్రమార్క మల్లు


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి  భట్టి విక్రమార్క మల్లు గారి   ఖమ్మం ప్రెస్ మీట్ పాయింట్స్ 

 సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించమని కోరుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సిపిఐ mla కూనమనేని సాంబశివరావు తో కల్సి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే బొగ్గు గనులు కేటాయించాలన్నారు.

 కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి  కలిసి ఇదే విషయం విన్నవించబోతున్నామన్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన, కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థ భవిష్యత్తు కొనసాగాలంటే కొత్త గనులు రావడం తప్పనిసరన్నారు.

ఈ గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాఇంచాలన్నారు.

 కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నికి చెందినవారు కనుక ప్రత్యేక చొరవ తీసుకోవాలని ,అవసరమైతే ప్రధానమంత్రి తో అఖిలపక్షం ద్వారా కలవడానికి సహకరించాలని కోరారు.

"అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నాం మా  ప్రాంతంగనులు మాకు ఇవ్వండి అని అడగడానికి మాకు ఎటువంటి  భేషజాలు లేవు ఇటీవల వేలం పాటలో పెట్టిన సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల ను వేలం పాటదారులు ఇప్పటివరకు ఆ గనులను చేపట్ట లేదు కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరుతున్నాం" అని భట్టి విక్రమార్క అన్నారు.

2015లో మైన్స్ అండ్ మినరల్స్ ఆక్ట్ కు సవరణ చేసినప్పుడు నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు దానికి భిన్నంగా వేలం పాటలు నిర్వహించకూడదు అంటున్నారని ఇది చాలా విడ్డూరం గా ఉందని విమర్శించారు.

వేలంపాటలో పాల్గొనకూడదు అని ఒకపక్క నిర్ణయం తీసుకొని సింగరేణిని పక్కకు ఉంచిన నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం  నాయకులు, తమకు అత్యంత సన్నిహిత మైన ఆరో, అవంతిక సంస్థలకు  కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు దక్కే విధంగా ఏర్పాటు చేశారు అన్నారు .

ఇక్కడ వేలంపాటలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకొని ఒడిస్సాలో మాత్రం వేలంపాటలో పాల్గొనాలని నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం ఇకనైనామానుకోవాలని కోరారు.

వారి పాలనలో సింగరేణి విధ్వంశానికి గురైందని, గనులు మూతపడ్డాయని కొత్త గనులు రాలేదని కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు .

సింగరేణి సంస్థను, సింగరేణి ఆస్తులను, సింగరేణి ప్రాంత కొత్త గనులను కాపాడుకోవడం కోసం తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ,ఇప్పటికే గత ప్రభుత్వ బొ గ్గు శాఖ మంత్రి నీ తానుకలిసానని ఇప్పుడు కూడా ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి నీ అవసరమైతే ప్రధానినీ కలవడానికి  వేడుకోవడానికిసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు