అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని 28 ఏండ్ల తర్వాత ఇలా కల్సింది

 పవన్ ఫాన్స్ కు సంబరం


టాలీవుడ్ నిర్మాతలు అందరూ అల్లు అరవింద్ తో సహా సోమవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి అభినందనలు తెలిపారు. వారిలో ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ.. కూడా  ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా..పరిచయం అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో 1996 లో సుప్రియ హీరోయిన్ గా నటించారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి  ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. ఇది కథానాయకుడిగా పవన్ కల్యాణ్ మొదటి సినిమా. కథానాయిక సుప్రియకు కూడా ఇది మొదటి సినిమా. ఈమె అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు. నటుడు సుమంత్కు చెల్లెలు. ఈ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు పునర్నిర్మాణం.ఈ చిత్రంలోని పాటలు, కామెడీ తో పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే మెప్పించాడు.
సుప్రియ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కానీ ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదు. 

గత కొంతకాలంగా నిర్మాతగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుప్రియ ఇవాళ నిర్మాతల సమావేశంలో పవన్ ను కలిశారు. డిప్యూటీ సీఎం గా ఎంపిక అయినందుకు.. పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన సుప్రియ.. ఆయనతో ఫోటో కూడా దిగారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఆ జంటను చూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  ఈ ఫోటో ఇప్పుడు నెత్తినటా వైరల్ అవుతోంది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయ పనులతో కూడా బిజీగా ఉండగా, సుప్రియ యాక్టింగ్ కి దూరం అయ్యి నిర్మాతగా బిజీగా మారింది. అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటున్నారు. 

---

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు