మహిళా కానిస్టేబుల్ పై అత్యా చారం -ఎస్ ఐ డిస్మిస్

 


కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి డిస్మిస్భు  చేసింది.లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయిన పోలీస్ శాఖ విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి డిస్మిస్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను ప్రభుత్వం సర్వీస్ నుంచి  తొలగిoచింది.కాగా భవానీ సేన్ వేధింపులపై మహిళా కానిస్టేబుల్.. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయట పడింది.  మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

తప్పించుకునే యత్నం….


లైంగిక దాడి ఘటన నేపథ్యంలో భవాని సేన్ వ్యవహారం పై గత రాత్రి డి ఎస్ పి కాళేశ్వరం స్టేషన్ లో విచారణ జరిపి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు…పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని భూపాలపల్లి కి తరలించారు…ఐయితే బుధవారం ఉదయం ఓ ప్రయివేటు వాహనం పిలిపించుకుని భవానీ సేన్ పారిపోయే ప్రయత్నం చేయగా పోలీస్ లు గమనించి పట్టుకున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీవీఎస్ భవానీసేన్ గౌడ్ అదే స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐపై సెక్షన్ 376(2) (ఎ) (బి), సెక్షన్ 324, సెక్షన్ 449, సెక్షన్ 506 మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేశారు.


డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) ఎ. సంపత్ రావు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ధృవీకరించారు.  మంగళవారం రాత్రి ఎస్‌ఐ భవానీసేన్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధితురాలిపై సర్వీస్ గన్‌ని ఉపయోగించి ఎస్ఐ చంపుతా నని బెదిరించి అత్యాచారం చేసాడు.

మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేసింది.

 దీంతో ఎస్పీ  విచారణకు డీఎస్పీని ఆదేశించారు.  మరికొందరు మహిళా కానిస్టేబుళ్లను కూడా గౌడ్ వేధించినట్లు విచారణలో తేలింది.

ఎస్‌ఐ భవానీసేన్ గౌడ్, గతంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో పనిచేసాడు. జూలై 2022లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష సన్నాహకాల్లో ఓ మహిళకు సహాయం చేస్తాననే నెపంతో  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఆ తర్వాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ లో పోస్టింగ్   ఇచ్చారు.

రెబ్బెనలో ఘటన మరువకముందే మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిజానికి కానిస్టేబుల్‌గా రిక్రూట్ అయిన భవానీసేన్ గౌడ్, ‘నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు’ axillary ప్రమోషన్‌ను అందుకున్నాడు. అతను ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన వాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు