తానే రణమై..నిప్పు కణమై ...!
********""**********
_14.06.1928_
___________________
చేగువేరా..
పుట్టినప్పుడే మరగడం
మొదలు పెట్టిందేమో
ఆయన రక్తం..
తుది శ్వాస విడిచే వరకు
అలా సలసలా
మరుగుతూనే ఉంది,.!
తెరిచిన ఉత్తర క్షణమే
ఆ కళ్ళు చింతనిప్పులై..
అగ్ని వర్షిస్తూ..
డేగను మించి తామే చురుకై
దుర్మార్గంపై కరుకై..!
ఆ కరాలు..
తాముగా ఖడ్గములు..
విల్లు ఎక్కుపెడిటే
గురితప్పని వేళ్లు..
నికార్సయిన శౌర్యానికి ఆనవాళ్లు..
ధీరత్వానికి నకళ్లు..!
ఆ కాళ్ళు..
చిరుతను మించిన వేగం..
సింహాన్ని తలపించే బలం..
తీస్తే దౌడు..
భీతిల్లే శత్రువుల దండు..!
ఆ గళం..
గర్జిస్తే ప్రళయమే..
ఉరిమితే ఉత్పాతమే..
ఆ నోట తిరుగులేని మాట..
చెప్పేది శాసనం..
అదే కట్టబెట్టింది సింహాసనం!
మొత్తంగా చే గువేరా..
కదం తొక్కే పోరాటం..
విప్లవానికి మానవరూపం..
తను గెరిల్లా..
అక్రమానికి వ్యతిరేకంగా
తానే ఒక లా..!
వైద్యుడై..
ప్రపంచ విప్లవానికి
తానే ఆద్యుడై..
పీడిత..బాధిత వర్గాలకు
ఆరాధ్యుడై..
సింహబలుడై..
ఎన్నెన్నో తిరుగుబాట్లకు
తానే కర్త..సంఘ సంస్కర్త..
ఎందరో మంచివాడని కొనియాడినా..
ఇంకెందరో కాదని తెగనాడినా..
చే గువేరా యుగకర్త..!
********"*******"******
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box