రోడ్డు పై వాహనాలు నిలిపితే సీజ్ చేస్తామని హెచ్చరిక
అలంకార్ జంక్షన్ నుండి ములుగు రోడ్ పెద్దమ్మగడ్డ బైపాస్ రోడ్ పై ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ సమస్య కలిగిస్తున్న మెకానిక్ షాపుల వారికి సెకండ్ సేల్ టూ వీలర్ షాపుల వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
బుధవారం అలంకార్ జంక్షన్ నుండి అజారా హాస్పిటల్ వరకు ట్రాఫిక్ ఎస్ఐ తనిఖీలు చేసారు. రోడ్డు కిరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని హెచ్చరించారు. ఐ హాస్పిటల్ సిబ్బందికి అట్లాగే అజారా హాస్పిటల్ సిబ్బందికి కూడ రోడ్డు కిరువైపులా వాహనాలు నిలుప రాదని చెప్పారు.
ఈ రోడ్డు పై గంగా గార్డెన్ వద్ద బ్రిడ్జి పనుల కారణంగా గత ఏడాది కాలంగా రాకపోకలు నిలిచి పోయాయి. ఈ మద్యే బ్రిడ్జి పనులు పూర్తిగా కాగా వాహనాల రాక పోకలు కొనసాగుతున్నాయి.
ఇది కూడ చదవండి ఇలాఉంటే ఎలా జీ ..!?
కార్ల రిపేరింగ్ షెడ్డులతో పాటు సెకండ్ సేల్ టూ వీలర్ షాపులు ఈ రోడ్డుపై విచ్చలవిడిగా వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. దాని వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కాకతీయ కాలని ఫేస్ టూ వాసులు ట్రాఫిక్ ఏసిపి సత్యనారయణ రావుకు పిర్యాదు చేసారు.
ఎసిపి ఆదేశాల మేరకు బుధవారం ఎస్ ఐ వేణు సిబ్బందితో రోడ్డు తనిఖి చేసి నిలిపి ఉన్న వాహనాలను తొలగింప చేశారు. రోడ్డు కిరువైపులా ఉన్న చెడి పోయిన కార్లను తొలగిచేందుకు మెకానిక్ లు సమయం అడిగారు. ఇక నుండి వాహనాలు నిలప రాదని ఎస్ఐ వారిని హెచ్చరించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box