Why not atleast 18..!?_
అప్పుడెప్పుడో..
1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ మొత్తం శాసనసభను చుట్టేస్తే విపక్షం డిఎంకె నుంచి కరుణానిధి ఒక్కరే విజయం సాధించి..చివరకు మొహం చెల్లక ఆయన కూడా సభకు వెళ్లలేదు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాల్లో మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలే పోయింది.
నవ్యాంధ్రలో సైతం మొన్న 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ
151 సీట్లు గెలుచుకుకోగా
ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది..
ఇవి మనం చూసిన ఘోరపరాజయాలు...
ఇప్పుడు వర్తమానంలోకి వస్తే
2019 ఎన్నికల్లో విజయం ఇచ్చిన మత్తు..అటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న కిక్కులో
2024 లో వైనాట్ 175 అనే స్లోగన్ను జనంలోకి వదిలిన
జగన్మోహన రెడ్డి తీరా ఆ సమయం వచ్చేపాటికి
బొక్క బోర్లా పడ్డారు.
ఇంతకీ జగన్ పరాజయానికి కారకులు ఎవరు..
కారణాలు ఏమిటి అనే అంశాలను ఇంతకు
ముందు చర్చించాం..
అందుకే కారకులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
సరే..పవన్ కళ్యాణ్..
చంద్రబాబు..
కూటమి నాయకులు..
వీరంతా ఒక కోణంలో
కారకులైతే..
అసలు వైసిపి నుంచి
Culprits ఎవరు..
ఇదీ పాయింట్..
వైసిపి ఓటమికి ప్రధాన కారకులు..
జగన్..జగన్..జగన్..జగన్..జగన్..జగన్..జగన్ .జగన్..
జగన్..జగన్..
అంటే ఒకటి నుంచి పది స్థానాల వరకు జగన్ వే..
ఇక ఆ తర్వాత..
మర్యాద అనిపించని
పదాలే అయినా..
వాడక తప్పడం లేదు..
జగన్ తర్వాత స్థానాలు..
వాగుడు కాయలు..
నానీలు..
రోజా..
సజ్జల..
బట్టలిప్పుకుని
దొరికిపోయిన ఎంపి..
సీదిరి..అనిల్ కుమార్..
సాక్షి పత్రిక..ఛానల్..
జగన్ నుదుటికి
తగిలిన రాయి..
అదిగో తన పేరు రెండో ప్లేస్ లో పెట్టలేదని ఓ గెడ్డపాయన
గుర్రుగా చూస్తున్నాడు..
ఆయన విజయసాయి రెడ్డి..
ఇప్పుడనే కాదు..రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి జగన్ బుర్రలో అనేక చెడు ఆలోచనలు ప్రవేశపెట్టి ఆయన ఎన్నో కేసుల్లో చిక్కుకునేలా చేసి ఆయన్ని పూర్తిగా చిక్కుల్లో ముంచేసిన కుత్సిత బుద్ది..
జగన్ ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టు భూ కబ్జాల్లో..అక్రమ దందాల్లో
కీలక పాత్ర పోషించిన ఘనాపాటి..ఎమ్మెల్యేలను..
మంత్రులను సైతం త్రోసి రాజని పెత్తనాలు సాగించిన
కుబుద్ది..ఆయనదే జగన్ తర్వాత స్ధానం..
నిస్సందేహంగా..!
ఆపై పోలీసులు..
జగన్ ఇచ్చిన స్వేచ్చతో చెలరేగిపోయిన
కొందరు ఐఏఎస్ లు..
ఇంకా కొందరు మంత్రులు..
ఎమ్మెల్యేలు..
ఎంపిటిసిలు.. జెడ్పిటిసిలు..
సర్పంచుల మొదలు
చిన్న నాయకుల వరకు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన
ఎక్కడికక్కడ వీరవిహారం చేశారు.. ప్రజాగ్రహాన్ని చవి చూశారు..!
*_ఈఎస్కే..జర్నలిస్ట్_*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box