కిట్స్ వరంగల్ సి యస్ ఈ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ షేక్ మునవర్ కి డాక్టరేట్

 కిట్స్ వరంగల్ సి యస్ ఈ  విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్  షేక్ మునవర్ కి డాక్టరేట్



 కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న షేక్ మునవర్ కి చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ డిగ్రీని పొందారని  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.   

కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ  షేక్ మునవర్  పిహెచ్‌డి పరిశోధనల  థీసిస్‌ను  "డీప్ లెర్నింగ్ మోడల్స్ యూజింగ్ కార్డియోవాస్క్యులర్ డిజార్డర్స్ రిస్క్ ప్రిడిక్షన్" సమర్పించారని తెలిపారు.

 అతను *డాక్టర్  A. గీత, ప్రొఫెసర్,* కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఫ్యాకల్టీ, అన్నామలై విశ్వవిద్యాలయం, చిదంబరం మరియు *డా. కొండా శ్రీనివాస్*, ప్రొఫెసర్ మరియు హెడ్, CSE(డేటా సైన్స్), CMR టెక్నికల్ క్యాంపస్, హైదరాబాద్ యొక్క సంయుక్త పర్యవేక్షణలో తన పరిశోధనను విజయ వంతంగా కొనసాగించారు అని  ప్రిన్సిపాల్  పేర్కొన్నారు.

తన పరిశోధనలో  షేక్ మునవర్  గుండె లయ రుగ్మతల నిర్ధారణ మరియు చికిత్సలో అరిథ్మియా వర్గీకరణ కీలకమైన పని అని  తెలిపారు. ఈసిజి సిగ్నల్‌లను వివిధ అరిథ్మియా వర్గాలుగా ఖచ్చితంగా వర్గీకరించడం తన పరిశోధన లక్ష్యం. ఆటోమేటెడ్ అరిథ్మియా వర్గీకరణ ఈ సి జి సిగ్నల్స్ యొక్క మాన్యువల్ విశ్లేషణ అవసరాన్ని తొలగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ సమయం తో కూడుకున్నది  మరియు ఖరీదైనది కావచ్చు. ఇట్టి సమస్యను అధిగ మించడానికి గాను,  వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రదాతల పనిభారాన్ని తగ్గిస్తుంది తద్వారా వారు ఇతర పనులపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది అని తన పరిశోధన లో తేలింది. ఇంకా వైద్య రంగంలో మొత్తం సామర్థ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. ఈ విశేషమైన పరిశోధన పని మొత్తం, ప్రతిపాదిత పని స్వయం సన్చాలక అరిథ్మియా వర్గీకరణలో ఉన్న పద్ధతులను అధిగమించింది.  పరిశోధనా ప్రయాణంలో షేక్ మునవర్  ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో మూడు సాంకేతిక పత్రాలను ప్రచురించారు అని  సగర్వంగా తెలిపారు.


ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, రాజ్య సభ మాజీ ఎం.పి., కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి గారు అండ్ ఫార్మర్ హుస్నాబాద్ యం యల్ ఏ & కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ గారు & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి సంయుక్తంగా అడ్వాన్స్డ ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు మిచిన్ లెర్నింగ్  రంగంలో మరింత అన్వయించ దగిన సమాజానికి అవసరమైన పరిశోధనలు చేసినందుకు   షేక్ మునవర్ ను శుభాకాక్షలతో అభినందించారు.


 ఈ కార్యక్రమంలో , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, సి యస్ ఈ విభాగపు హెడ్ & ప్రొఫెసర్, డా పొలాల  నిరంజన్ రెడ్డి, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు. అధ్యాపకులు, సిబ్బంది మరియు హెడ్, ఫిజికల్ సైన్సెస్ & కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి,  పిహెచ్‌డి నీ పొందడం పట్ల   షేక్ మునవర్  ను  అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు