నిజం..ఇదే పవనిజం..!


 నిజం..ఇదే పవనిజం..!


ఇన్నాళ్లు పవనిజం 

అంటే రకరకాల

వివరణలు..


అయితే 

మునుపు చూసిన 

పవన్ వేరు..

ఇప్పుడు చూస్తున్న 

జనసేనాని వేరు..


ఎన్నికల యుద్ధంలో 

పవన్ విరుద్ధం..

గెలిచాక కళ్యాణ్ వైరుధ్యం..


ఇప్పుడు చూద్దాం అసలైన 

పవనిజం అంటే ఏంటో..


ఎన్ని విమర్శలు ఎదురైనా

మొక్కవోని ధైర్యంతో

ముందుకు నడవడం..

*_పవనిజం..!_*


అయిదేళ్ల క్రితం 

ఘోర పరాజయ

అగాథాల నుంచి 

ఉవ్వెత్తున లేచి 

ఎగసిన మహాకెరటం

*_పవనిజం..!_*


తన పార్టీకి ఒక్క సీటు..

తనకే రెండు పరాజయాలు..

తట్టుకుని నిలబడి

ఈరోజున 

తన కంటే ఎంతో పెద్దవారు..

అనుభవజ్ఞులు అయిన.. కలవని రెండు శక్తులను

కలిపి రాజకీయాలను మలుపు తిప్పడం..

*_పవనిజం..!_*


అనుకున్నది 

సాధించే దాకా

మడమ తిప్పకుండా

పోరాటం చేయడం..

*_పవనిజం..!_*


నిన్న.. 

ప్రమాణస్వీకార వేదికపై

మోడీ.. వెంకయ్య నాయుడు..

అమిత్ షా.. గడ్కరీ..

రజనీకాంత్..బాలకృష్ణ..

పురంధేశ్వరి సమక్షంలో..

చంద్రబాబుతో ఒక కుటుంబ సభ్యునిలా అరమరికలు మరచి

ప్రవర్తించిన హుందాతనం..

*_పవనిజం..!_*


మొన్న ఢిల్లీలో ఎన్డీయే వేడుకలో మోడీ స్వయంగా

ఈ పవన్ మామూలోడు కాదు..ఒక తుఫాను..

అని ప్రశంసించేంతగా

నడచుకోవడమే..

*_పవనిజం..!_*


ఎలాంటి పరిస్థితుల్లోనైనా చలించని చంద్రబాబు నాయుడంతటి స్థితప్రజ్ణున్ని మొన్నటి రోజున..

ఆయన నలిగిపోయాడు..

ఆయన నలిగిపోయాడు..

అంటూ కళ్ళ నీళ్లు పెట్టించినంత ఆత్మీయత

కురిపించిన ఇజమే..

*_పవనిజం..!_*


మోడీ అంతటి పెద్దాయన 

చెవిలో చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని అన్న చిరంజీవి వద్దకు తీసుకువచ్చి 

మెగాస్టార్ గర్వపడేలా

మోడీతో కరచాలనం చేయించి అన్న రుణం తీర్చుకున్నదే..

అసలు సిసలైన 

*_పవనిజం..!_*


కొణిదెల వెంకటరావు 

అనే వ్యక్తి కొడుగ్గా మొదలైన జీవితం..


మెగాస్టార్ తమ్ముడిగా

సినిమా ప్రవేశం..


పవర్ స్టార్ గా అభిమానుల

గుండెల్లో స్థానం..


రాజకీయ యాత్రలో తొలిరోజుల్లో 

చేదు అనుభవాలు తట్టుకుని..

నిలబడి..కలబడి..

ఈ రోజున మోడీకి

ఆత్మీయుడుగా..

జాతికి పరిచయమైన

నిజజీవిత హీరోయిజం..

*_పవనిజం..!_*


ఎలిశెట్టి సురేష్ కుమార్

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు