వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సచివాలంయలో వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్సంబంధిత కార్పోరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎరువులు, విత్తనాల లభ్యతతో పాటు రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. విత్తనాలు ఎరువులకు సమస్య తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపోను అందుబాటులో ఉండేలా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయశాఖ: పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ గురించి వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి హరిత వివరిస్తూ, 61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలు రైతులకు అందచేసామని, ఇంకా అవసరమున్న మేరకు విత్తనాలు తెప్పించి ఇస్తున్నామని తెలియజేసారు. అదేవిధంగా గతేడాది 15 జూన్ నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈ సంవత్సరం 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకేట్లు కొనుగోలు చేశారని తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలోనే ఆదేశించిన విధంగా ప్రతివిత్తన కంపెనీ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన హామీమేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేసారా, లేదా, ఆ ప్యాకేట్లు అన్ని రైతులకు చేరాయా లేదా అనేది తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఎరువుల లభ్యతపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, జూన్, జులై నెలల అవసరాలమేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.
రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డిఏపి 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలుపగారు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతు రాష్ట్రానికి అవసరమేర ఎరువులు రెండు నెలల ముందుగానే తెప్పించేవిధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.
అదేవిధంగా పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావులేకుండా జరగాలని ఆదేశించారు.
ఉద్యానశాఖ: డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ ఫాంల కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్ధేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని కంపెనీలకు నోటిసులు ఇచ్చామని తెలిపారు. అటువంటి కంపెనీలపై వెంటనే చట్టప్రకారం తగుచర్యలు తీసుకోవల్సిందిగా మంత్రి సూచించారు. అదేవిధంగా డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పాం పంటకే కాకుండా ఇతర పంటలకు వర్తింపచేసేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, దానికనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాల్సినందా మంత్రి సూచించారు.
అదేవిధంగా వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ మరియు ఇతరశాఖల ఆధీనములో ఉన్న ప్రభుత్వ భూములను దేనికోసమైతే కేటాయించాలో, ఆ లక్ష్యాలు నేరవేర్చేవిధంగా ఉపయోగంలోకి తీసుకువ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ముఖ్యంగా విత్తనోత్పత్తిక్షేత్రాలలో విత్తనోత్పత్తి, ప్రభుత్వ నర్సరీలలో పూలు మరియు పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలను, మొక్కలను సరఫరా చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మార్కెటింగ్ మరియు గిడ్డంగుల అధికారులు, మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్షిస్తూ, గతంలో సూచించిన విధంగా సౌరవిద్యుత్ యూనిట్లను నెలకొల్పె అవకాశాలపై సంస్థల వారిగా ప్రగతిని ఆరాతీశారు. పహడిషరీఫ్ లో వక్ఫ్ భూములలో ఏర్పాటుచేసిన తాత్కలిక షెడ్లలో సబ్ మార్కెట్ ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా మార్కెటింగ్ సంచాలకులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అగ్రికల్చర్ కార్యదర్శి రఘునందన్ రావు , HACA ఇంఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సత్యశారద , ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాములు , వేర్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి , మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box