కిట్స్ వరంగల్ లో ముగిసిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్" అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ "(యఫ్ డి పి)

 


కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ ఆధ్వర్యంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్" అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డిపి)  కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ముగింపు కార్యక్రం శనివారం జరిగింది.

 ఇది 2024, జూన్ 18 నుండి జూలై 1 వరకు ఈ కార్యక్రమం రెండు వారాలు  నిర్వహించినట్లు ఇంచార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్   తెలిపారు. 

 ముగింపు కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నై కి చెందిన పిరమిడ్ టెక్నాలజీస్ కార్పొరేట్ ట్రైనర్ శివ ప్రసాత్ మునిసామీ  ఇంచార్జి ప్రిన్సిపల్ & డీన్ అకడమిక్స్, ప్రొఫెసర్ కె. వేణుమాధవ్ మరియు కంప్యూటర్ విభాగాల అధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 



 ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చెన్నై కి చెందిన పిరమిడ్ టెక్నాలజీస్ కార్పొరేట్ ట్రైనర్ శివ ప్రసాత్ మునిసామీమాట్లాడుతూ కిట్స్‌డబ్ల్యు వారు అత్యాధునిక సాంకేతిక నిపుణుల శిక్షణ నిర్వహణకు ఇండస్ట్రీ నీడెడ్ ఫ్యాకల్టీ కి శిక్షణ ఇవ్వడమేకాకుండ సాంకేతిక అధ్యాపకులను నిపుణులు గా, నిష్ణాతులు గా సమాయత్తం చేయడమే ఎఫ్‌డిపి ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

 తద్వార విద్యార్థులకు ఉద్యోగ సముపార్జన శిక్షణ సులభతరం అవుతుందని అంతే కాకుండా విద్యార్థులు సార్ట్-అప్ లతో కూడిన యువ పారిశ్రామిక వేత్తలు గా తయారు అవుతారన్నారు.

 కిట్స్ వరంగల్  ఎ ఐ మరియు యం యల్ రంగంలో సి యస్ ఈ, సి ఎస్ ఎన్ , సి ఎస్ ఈ (ఎ ఐ మరియు యం యల్), మరియు ఐ టి వంటి అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు పరిశ్రమ 4.O(ఇండస్ట్రీ 4.O) సాంకేతికతలలో పారిశ్రామిక యఫ్ డి పి ని ఏర్పాటు చేసినారు.  చాలా నిబద్ధత, నైపుణ్యం అవసరమయ్యే అధునాతన సైన్స్ & టెక్నాలజీని బోధించడం మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యలో ఎ ఐ మరియు యం యల్ డిజైన్ యొక్క పాఠ్యాంశాలు ఇండస్ట్రీ కాలబో రేషన్తో కూడిన శిక్షణ ఉద్యోగ సముపార్జన లో కీలక పాత్ర పోషిస్తాయని  ఆయన తెలిపారు.



ఈ సందర్భంగా సి యస్ ఈ విభాగం, హెడ్ & ప్రొఫెసర్. పి నిరంజన్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు.

 ఎ ఐ మరియు యం యల్ సాంకేతికతలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికతలతో పాల్గొనే  అధ్యాపక బృందం ను సన్నద్ధం చేయడానికి  యఫ్ డి పి రూపొందించబడింది. అధ్యాపకులు వారి రంగాలలో తాజా పురోగతుల గురించి తెలుసుకునేలా చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది.   యఫ్ డి పి   యొక్క ఫలితం ఏమిటంటే పరిశ్రమ 4.O కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి గాను అధ్యాపకులకు అత్యాధునిక సాంకేతిక ఇండస్ట్రీ నిపుణుల చే ఇప్పించడము అని  తెలిపారు. 


ఈ సందర్భంగా  రాజ్యసభ మాజి సబ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి    పి.నారాయణరెడ్డి , హుస్నాబాద్ నియోజకవర్గ మాజి  ఎమ్మెల్యే కిట్స్ అడిషనల్ సెక్రెటరీ,  వి. సతీష్ కుమార్, కిట్స్ వరంగల్ డీన్ అకడమిక్స్ & కంప్యూటర్ అధ్యాపక బృందంను యఫ్ డి పి నీ విజయ వంతంగా నిర్వహించి నందుకు అభినందించారు 


ఈ కార్యక్రమంలో  కిట్స్ వరంగల్ ఇంచార్జి ప్రిన్సిపల్ & డీన్ అకడమిక్స్, ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, అన్ని డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ పి.నిరంజన్ రెడ్డి(సీఎస్ఈ), ప్రొఫెసర్ ఎస్.నర్సింహారెడ్డి(సీఎస్ఎం), ప్రొఫెసర్ వి. శంకర్ (సిఎస్ఎన్) ప్రొఫెసర్ టి. సెంథిల్ మురుగన్ (ఐటి), ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకరా చారి, అధ్యాపక కోఆర్డినేటర్స్ గా డా యస్ ఏ మోయిద్, గౌతమ్, బి శ్రీనివాస్, రాజేష్ మరియు 150 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు.


--ఎండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు