ఢిల్లీలో ఎండలు భగ భగ మండి పోతున్నాయి. ఉష్టోగ్రత 45 డిగ్రీలను మించి రికార్డు అవుతోందని చెబుతున్నారు. దేశంలో ఈ సారి అన్ని చోట్ల ఉష్టోగ్రత బాగా పెరిగి పోయింది. ఉష్ణోగ్రతకు తోడు వడగాల్పులు దంచివీస్తున్నాయి. గత రెండు ముడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో పలువురు అస్వస్థత చెంది ఆసుపత్రుల పాలవుతున్నారు.
రెండ్రోజుల్లోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో వెంటిలేటర్‌పై మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోను పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
ALSO READ....శ్రీజ మొదటి భర్త మృతి
వడదెబ్బ కారణంగా ఢిల్లీలో మరణాల రేటు 60 శాతం నుంచి 70 శాతంగా ఉంది. నెల రోజులుగా ఢిల్లీవాసులు అధిక ఉష్ణోగ్రతలు... ఎండవేడితో అల్లాడిపోతున్నారు. దాదాపు నిత్యం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం అయితే ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ నిన్న హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీలో బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశముందని, రేపు, ఎల్లుండి కాస్త ఉపశమనం ఉండవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు రావడానికి మరో రెండు వారాల సమయం ఉందని... ఈ నేపథ్యంలో అప్పుడే ఎండల నుంచి ఉపశమనం ఉండకపోవచ్చునని తెలిపింది.
---ఎండ్స్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box