*కిట్స్ వరంగల్ సి యస్ ఈ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ నలిగంటి సంతోష్‌ కుమార్‌ కి డాక్టరేట్

 కిట్స్ వరంగల్ సి యస్ ఈ  విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ నలిగంటి సంతోష్‌ కుమార్‌ కి డాక్టరేట్

 


కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అ సిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న  నలిగంటి సంతోష్‌ కుమార్‌కి  గీతం యూనివర్సిటీ విశాఖపట్నం పరీక్షల నియంత్రణ అధికారి పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేసినారు

 ఈరోజు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నలిగంటి సంతోష్‌ కుమార్‌ పిహెచ్‌డి  థీసిస్‌ను “ బ్లడ్ వేసెల్ సిగ్మెంటేషన్ ఫ్రమ్ డయాబెటిక్ రెటినోపతి ఫండస్  ఇమేజెస్ యూజింగ్ సింగులర్ వాల్యూ డికపోజిషన్ అండ్ మాక్సిమమ్  ప్రిన్సిపల్ కర్వేచర్” అనే అంశంపై సమర్పించారు.  అతను తన పరిశోధన ని గీతం విశ్వవిద్యాలయం  స్కూల్ ఆఫ్ టెక్నాలజీ,ప్రొఫెసర్, డాక్టర్ యలవర్తి రాధిక గారి పర్యవేక్షణలో  విజయ వంతంగా కొనసాగించారు అని  ప్రిన్సిపాల్  పేర్కొన్నారు.

తన పరిశోధనలో సంతోష్‌ కుమార్‌  డయాబెటిక్ రెటినోపతి అయిన డిఆర్ (డయాబెటిక్ రెటినోపతి) అనే రెటీనాకు మధుమేహం వ్యాప్తి చెందడం వల్ల చాలా మంది డయాబెటిక్ రోగులు తమ కంటి చూపును కోల్పోయారు. ఈ బయోలాజికల్ సమస్యని దృష్టిలో ఉంచుకొని, డి ఆర్ ని తగ్గించడానికి లేదా తొలగించడానికి, వీలైనంత త్వరగా డి ఆర్ ని గుర్తించడం చాలా ముఖ్యం అని గమనించారు. విభజించబడిన రెటీనా ఇమేజెస్ విశ్లేషణ డి ఆర్ ని నిర్ధారించేటప్పుడు నేత్ర వైద్యుల పనిని సులభతరం చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులలో కంటి చూపు లేదా చివరికి కళ్ళు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ అద్భుతమైన పరిశోధన పని అత్యంత లక్ష్యంగా పని చేసినది.  పరిశోధనా ప్రయాణంలో, నలిగంటి సంతోష్ కుమార్ ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో  సాంకేతిక పరిశోధనలో పేపర్లను ప్రచురించారు అని  సగర్వంగా తెలిపారు.


ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్య సభ ఎం.పి., కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి గారు, ఫార్మర్ హుస్నాబాద్ యం యల్ ఏ అండ్ కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ గారు అండ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి గారు సంయుక్తంగా బయోమెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో మరింత అన్వయించ దగిన సమాజానికి అవసరమైన పరిశోధనలు చేసినందుకు  సంతోష్‌ కుమార్‌ గారిని శుభాకాక్షలతో అభినందించారు.


 ఈ కార్యక్రమంలో , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, ప్రొఫెసర్ & సి యస్ ఈ విభాగపు హెడ్, డా. పొలాల  నిరంజన్ రెడ్డి, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు అధ్యాపకులు, సిబ్బంది మరియు హెడ్, ఫిజికల్ సైన్సెస్ & కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి,  పిహెచ్‌డి నీ పొందడం పట్ల  సంతోష్‌ కుమార్‌ ను  అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు