బిజెపి ఏజెంట్ మంద కృష్ణ మాటలు నమ్మొద్దు -వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

 


వికలాంగుల జాతిని బిజెపి కి తాకట్టు పెట్టకండి 


బిజెపి ఏజెంట్ మంద కృష్ణ మాటలు నమ్మొద్దు


  వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య 

 

  వికలాంగ సోదరి రజినీ కి ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాన్ని కించ పరచడం అనైతికం


   ప్రభుత్వానికి వికలాంగులను వ్యతిరేకం చేయటమే ముఖ్య లక్ష్యంగా చేసుకొని మంద కృష్ణ రాజకీయాలు చేస్తున్నారని, వికాలంగ సోదరి రజనీకి ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాన్ని కించ కించపరిచేలాగా మాట్లాడుతున్న మంద కృష్ణ పద్ధతి మార్చుకోవాలని వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

  బిజెపి ఏజెంటుగా మారిన మంద కృష్ణ రాజకీయ పబ్బం కోసం చేస్తున్న కుటిల రాజకీయాల వల్ల ఆయనకు మేలు జరిగి వికలాంగులకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వికలాంగులను మంద కృష్ణ వాడుకుంటున్నారని, మంద కృష్ణ మొదట దర్నా చేయాల్సింది కిషన్ రెడ్డి ఇంటిముందని, వికలాంగులకు మంద కృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మందకృష్ణ కె సి ఆర్ ను పొగడటం అంటే ముమ్మాటికీ వికలాంగులను అవమానించడమేనని, ద్రోహం చేయటమేనని ఆయన అన్నారు.    

    గత 10 ఏండ్ల లో కేంద్రం లో అధికారంలోనున్న బీజేపీ వికలాంగులకు నేషనల్ ట్రస్ట్ కి ఛైర్మన్ ను ఎందుకు నియమించలేదని, వికలాంగుల చట్టానికి కమిషనర్లను ఎందుకు నియమించలేదని, కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పనికిరారనీ చట్టము చేశారరని, తొమ్మిది జాతీయ వికలాంగుల సంస్థలని నాలుగు జాతీయ సంస్థలుగా విలీనము చేశారని, ఒక్క జాతీయ వికలాంగుల సంస్థలలో కూడా ఒక్క నియామకం చేయలేదని విమర్శించారు. 



    వికలాంగుల హక్కుల చట్టం 89,92,93 సెక్షన్లలని ఎత్తివేయడానికి ప్రయత్నం చేశారని 

పార్లమెంటు ల్యాడ్స్ లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదని, గత 10 ఏండ్లు బడ్జెట్ లో వికలాంగులకు అన్యాయం చేశారని, 2017 మానసిక వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం జిల్లాకొక వికలాంగుల కేంద్రము ఎర్పాటు చేయాలి నిబంధన ఉన్నా బిజెపి చేయకపోను హైద్రాబాద్ లో ఉన్న ఆరంఘర్ మానసిక వికలాంగుల కేంద్రం ఎత్తేసే ప్రయత్నం చేశారని అన్నారు. వికలాంగులకు ఎన్నో అన్యాయాలు చేస్తూ వికలాంగుల ను తీవ్రంగా మోసం చేసిన బిజెపికి మంద కృష్ణ ఎందుకు  మద్దతునిస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి మేనిపెస్టోలో వికలాంగుల సంక్షేమం గూర్చి ఒక్క విషయం కూడా లేదని అన్నారు. కేంద్రములో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వికలాంగులకు 6 న్యాయాలు ప్రకటించిందని, అందులో ముఖ్యంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని అన్నారు. 2007 లో వికలాంగులకి రాజకీయ రిజర్వేషన్లు కేంద్రంతో పోరాడి ఇప్పిస్తాన్న మంద కృష్ణ నేడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. 

   మీరు గత కెసిఆర్ ప్రభుత్వ హయంలో 10 ఎండ్లలో వికలాంగుల ఆత్మహత్యలు చేసుకున్నా ఎన్నొ అన్యాయాలు జరిగినా మంద కృష్ణ ఎందుకు ఉద్యమాలు చేయలేదని, కేవలము 2018 ఎన్నికల సమయంలో ఒకసారి 

2023 ఎన్నికల కంటే ముందోకసారి వికలాంగుల మీటింగు పెట్టి మమ్మల్ని ఎవరికో తాకట్టు పెట్టీ మంద కృష్ణ రాజకీయ పబ్బం గడుపుకున్నాడని అన్నారు. 2014 లో ఇస్తానన్న హెల్త్ కార్డులు ఎటుపోయినవని, జిల్లాకో వికలాంగుల స్టడి సర్కిల్ ఎటు పోయిందని, కాంగ్రెస్ హాయంలో ఏర్పరిచిన వికలాంగుల స్టడీ సర్కిల్ కేసీఆర్ మూసివేసినపుడు మంద కృష్ణ ఎటు పోయారని, ఇద్దరు వికలాంగులు పెండ్లి చేసుకుంటే ఒకరికి ఉద్యోగం ఎటు పోయిందని, కనీసం వారికి మ్యారేజ్ ఇన్సెంటివ్ రాకపోతే మీరూ ఎందుకు ప్రశ్నించలేదు దని అన్నారు. 57ఎండ్లకే పెన్షన్ అని ఇవ్వక పొతే నోరు ఎత్తలేదని, బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన ప్రభుత్వ హాస్టల్ లో బొమ్మ కంటి మహేందర్, రాగుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకుంటే ఉద్యమము చేయక పోను మీరూ కనీసం పరామర్శకి కూడా రాలేదని అన్నారు. ఎన్నొసార్లు బిఆర్ఎస్ నాయకులే వికలాంగుల మీద దాడులు చెస్తే వెంటనే మంద కృష్ణ ఉద్యమించలేదనీ విమర్శించారు. 

   10 ఏండ్ల లో ఒక్క సారి కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి హాజరు కాకుండా మా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ, మా సంక్షేమంపై గొడ్డలి మోపిన కెసిఆర్ ను మీరూ మెచ్చుకున్నారంటే వికలాంగులను అవమానించడమేనని అన్నారు. 

   రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోపల వికలాంగ సోదరి రజని కి ఉద్యోగం ఇచ్చి వికలాంగుల. ఆత్మబంధువు అయ్యాడని అన్నారు.

    ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ పెంపు, మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణం లో మా మహిళా వికలాంగ సోదరి మణులు,500 కే గ్యాస్ సిలిండర్, కోర్టులో నాలుగు శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్, సదరం స్లాట్ సులభతరం ఇలా ఎన్నో అంశాలలో లబ్ధి పొందుతున్నారని అన్నారు. బీజేపీకి అమ్ముడు పోయి వికలాంగుల సంఘాల మధ్య చిచ్చు పెడుతూ వికలాంగులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. 

     ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జనరల్ సెక్రటరీ వి. నరసింహచారి, గ్రేటర్ హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అద్యక్షుడు దేశగాని సతీష్ గౌడ్, రంగారెడ్ది జిల్లా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అద్యక్షుడు మధ్యపాక సురేష్, మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం కో ఇంఛార్జి కె. నరసింహ చారి, యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా సీనియర్ నాయకులు కె. నరేష్ తదితరులు పాల్గోన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు