200 పడకల ఏరియా ఆసుపత్రి చివరి దశ నిర్మాణ పనులలో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి.
200 పడకల ఏరియా ఆసుపత్రి చివరి దశ నిర్మాణ పనులలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్ మహేందర్ జి. తో కలిసి ప్రేమ్ నగర్ లోని ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చివరి దశ నిర్మాణ పనులలో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఈ భవనం లో మెడికల్ కళాశాల కు కేటాయించగా 2024 - 2025 విద్య సంవత్సరనికి 50 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
అనంతరం మెడికల్ కళాశాల కొరకు కేటాయించిన గ్రౌండ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్య పాల్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బానోత్ మోహన్ లాల్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box