ఎపి రేయాన్ ఫ్యాక్టరీకి మంచి రోజులు రానున్నాయి - సాద్యమైనంత త్వరలో నూతన పరిశ్ర- మంత్రి సీతక్క

 


బిల్ట్ - ఏపి రేయాన్స్ స్థానంలో కొత్త పరిశ్రమ

జిల్లాలో నిరుద్యోగుల  ఉపాధి కోసం కొత్తపరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు


ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించిన ఏపిరేయాన్స్ పల్ప్ ఫ్యాక్టరి - బిల్టు పరిశ్రమ స్థానంలో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు  జరుగుతున్నాయని పంచాయితి రాజ్  గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

అటవి ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి చిత్రా మిశ్రాతో కల్సి  ఏపిరేయాన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. 

బిల్ట్ ఆధీనంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలను ప్రస్తుతం స్క్రాప్ కింద తొలగిస్తున్నారు.

మొదట్లో రేయాన్ ఉత్ప్తితి చేసిన ఈ పరిశ్రమలో ఆ తర్వాత యాజమాన్యం చేతులు మారి పల్ప్ తయారు చేసారు. 

వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పించింది.

పరిశ్రలో తయారైన పల్పుకు డిమాండ్ లేక పోవడంతో యాజమాన్యం ఉత్పత్తి నిలిపి వేసింది.

దాంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి

ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని గతంలో ప్రబుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయాయి.

కాంగ్రేస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిశ్రమను తెరిపించేందుకు ఐటిసి కంపెనీతో చర్చలు జరిపి ఒప్పించారు. 

కొత్త పరిశ్రమను  ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

సాధ్యమైనంత వరకు కొత్తపరిశ్రమ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో వేలాది యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

----ends

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు