వరంగల్ పోలీసుల లొంగి పోయిన మావోయిస్టు దంపతులు
తిక్క సుష్మిత @ చైతే ఏరియా కమిటీ మెంబర్,
మడకం దూల @ దూల ఏరియా కమిటీ మెంబర్.
వివరాలు వెల్లడించిన కరీంనగర్ , ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్.
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి అయిన పుల్లూరి ప్రసాద రావు @ చంద్రన్న వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా , దూల ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేశారని తెలిపారు.
హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత 27 తన ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా , పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేసారు.
మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు ఈ రోజు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వీరిరువురి పై ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశామని పోలీస్ కమీషనర్ తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box