జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ల్యాండ్ యుటీలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ లోని కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకెపి
సీసీలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను అప్రమత్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. క్షేత్రం స్థాయిలోకి వెళ్లి వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఐదు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు కింద చేశారని, ఇందులో కరీంనగర్ జిల్లా ఉందని తెలిపారు. వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారా.. నిర్మాణాలు ఉన్నాయా.. ప్లాటింగ్ చేశారా.. లేదా.. అన్ని వివరాలపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా విహరించాలని సూచించారు. కరీంనగర్ రూరల్ మండలంలో ల్యాండ్ యుటీలైజేషన్ సర్వేను 4-5 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. సర్వే కి సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎంపీడీవో సంజీవరావు, ఎంపీ ఓ జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box