కేరళ కానుంది ఇక “కేరళం” - అసెంబ్లీలో తీర్మాణం


change of the name - kerala as keralam

కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని  కోరుతూ రాష్ర్ట  అసెంబ్లీ లో సోమవారం తీర్మాణం చేశారు.


మలయాలంలో   స్థానికులు కేరళంగా పిలుస్తారు. కాని రికార్డుల్లో మాత్రం కేరళగా రాష్ర్టం పేరు స్థిర పడి పోయింది. “కేర” అంటే కొబ్బరి చెట్టు “ఆళం” అంటే భూమి. సహజసిద్దమైన వనరులు కలిగి కొబ్బరి చెట్లతో ప్రకృతి సోగాయలతో ఆహ్లాదంగా కనిపించే ఈ ప్రాంతానికి కొబ్బరి చెట్ల ప్రాంతం అంటే మలయాలంలో  కేరళంగా పిలుస్తారు.


గతంలో రాష్ట్రం పేరును మార్చాలని ఏడాదిన్నర  క్రితం 2023  ఆగస్టు  9న అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపించారు. అయితే కేంద్రం మరిన్ని సవరణలు కోరుతూ తీర్మాణాన్ని వెనక్కి పంపింది. దాంతో కేంద్రం కోరిన సవరణలు చేసి అసెంబ్లీలో మరో సారి తీర్మాణం చేసారు.


రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రాన్ని అధికారికంగా 'కేరళం'గా మార్చడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సభ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంప‌నున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు