ఫోన్ ట్యాపింగ్ కేసు లో కేసీర్ అరెస్ట్ తప్పదు -మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

 


ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ కేసు నుండి తప్పించు కోలేరని అన్నారు. కేసు నుండి తప్పించు కోవాలని కేసీఆర్ చేయని ప్రయత్నాలంటూ లేవని అన్నారు. అమెరికా లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు ను ఇండియాకు రాణీయకుండా కేసీర్ రాయబారం నడిపారని మంత్రి ఆరోపించారు. ప్రభాకర్ రావు ను కలిసేందుకు మాజీ మంత్రి కేసీర్ మేనల్లుడు హరీష్ రావు అమెరికా వెళ్లాడని అన్నారు.


గత నెల 26న ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ నంబరు ఈకే 525లో హరీశ్​రావును అమెరికాకు వెళ్లాడని  ఆరోపించారు. ఈ విషయాన్ని హరీష్ రావు కాదన గలడా అని ప్రశ్నించారు.
అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని హరీశ్‌రావు ప్రమాణం చేస్తారా అని సవాల్​ విసిరారు. ఎన్నిరోజులైనా కేసీఆర్​ను వదిలిపెట్టేది లేదని, వెంటనే వచ్చి లొంగిపోవాలని ప్రభాకర్‌ రావుకు మాజీ సీఎం చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిపోయారని, జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్య్ర దినోత్సవాన్ని చేసుకునే వారని చెప్పారు.
మాజీ సీఎంకు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని, పదేళ్ల రాక్షస పాలన పోయిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉద్యమంలో కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ రాజీనామా చేసింది కలెక్షన్స్ కోసమేనని, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆయనే అసెంబ్లీలో చెప్పారని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే అని ప్రజలకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరని, దాంట్లో ఓటర్లందరూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నందున తాము ఆ పార్టీ నాయకుల లాగా ప్రలోభాలకు గురి చేయకూడదనే డబ్బులు పంచలేదని తెలిపారు.

'రాష్ట్రంలో నీచమైన పని ఫోన్​ ట్యాపింగ్​. దొంగచాటుగా ఎస్​ఐబీ మాజీ చీఫ్, రిటైర్డ్​ అధికారి ప్రభాకర్​రావు కింద రౌడీ గ్యాంగ్​ రాధాకిషన్​రావు, ప్రణీత్​రావు, భుజంగరావు, తిరుపతన్నలతో లక్షల కోట్లు వసూలు చేశారు. ప్రభాకర్​ రావు అప్రూవర్​గా మారతారని, ఆయనను కలిసేందుకు కేసీఆర్​ హరీశ్​రావును అమెరికాకు పంపించారన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు