కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

 


*కాలేశ్వరం ప్రాజెక్టు  మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి* 


*సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*


*ఎన్ డి ఎస్ ఏ  సూచనల ప్రకారం కొనసాగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు*


*గత ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తే మా ప్రభుత్వం సీరియస్ గా పని చేస్తున్నది*


*జ్యుడీషియల్ ఎంక్వయిరీ తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దోషులకు శిక్ష తప్పదు: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*


*హెలికాప్టర్ ద్వారా  బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన*



 కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల వద్ద జరుగుతున్న  మరమ్మత్తు పనులను ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.

శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పెద్ద పల్లి జిల్లా సుందిళ్ళ వద్ద  పార్వతి బ్యారేజ్ ను సందర్శించి అక్కడి నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారంకు  హెలిక్యాపార్ట్ ద్వారా చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా,  ఎస్పీ కిరణ్ ఖరే  స్వాగతం పలికారు.  అక్కడి నుండి సరస్వతి బ్యారేజ్ ద చేరుకొని  గ్రౌటింగ్ పనులు, సీసీ బ్లాక్స్ అమరుస్తున్న విధానాన్ని పరిశీలించి ఇరిగేషన్  ఈఈని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డుకు చేరుకొని ఎల్ అండ్  విశ్రాంతిలో  భవనంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అనంతరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో జరుగుతున్న పనులను బ్యారేజి దిగువకు చేరుకొని మొదటగా

17, 20 నంబర్ పిల్లర్లు వద్ద గల గేట్లను పరిశీలించి అక్కడి నుండి  20వ నెంబరు పిల్లరు వద్ద పగుళ్లు ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించి పగుళ్లు ఏవిధంగా పూడ్చుతున్నారని,  జరుగుతున్న పనుల వివరాలను ఎల్ అండ్ టి ఇంజనీర్లని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ

 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఎ) కమిటీ సిఫార్సుల మేరకు  వర్షాకాలంలో నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు కుంగిన బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తుల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్  అమలులో ఉన్నందున ఇప్పటి వరకు జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించారని, బ్యారేజీల లో జరుగుతున్న మరమ్మత్తుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.


బ్యారేజిల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని అన్నారం ప్రాజెక్ట్ లో 60 శాతం పనులు,  మేడిగడ్డ్ లక్ష్మీ బ్యారేజ్ లో 80 శాతం మరమ్మత్తు పనులు పూర్తి కావచ్చాయని సుందిళ్ళలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నత్త నడకపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  వర్షాలు రాక ముందే పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి గతః ప్రభుత్వం 94 వేల కోట్ల ఖర్చు చేస్తే కేవలం లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే తయారైందని,  అది కూడా ఇప్పుడు 

కుంగుబాటుకు గురైందని, 

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన 94 వేల కోట్ల రూపాయలకు వడ్డీ కడుతున్నామని అన్నారు. డిసెంబర్ 7న తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని 

ప్రాజెక్టుపై అనుభవం ఉన్న డ్యామ్ సేఫ్టీ అధికారులను సంప్రదించి చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి పలు సూచనలు తీసుకున్నామని అన్నారు.

అందులో మూడు బ్లాకుల గేట్లు ఎత్తి ఉంచాలని అలా ఉంచితే బ్యారేజీకి నష్టం వాటిల్లదని చెప్పడం  జరిగిందని,  కొన్ని ఇంటర్ మెజర్స్ సూచించారని, 

ఎన్ డి ఎస్ ఏ నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు

మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టి, అన్నారంను ఆఫ్రాన్ కన్స్ట్రక్షన్స్, సుందిళ్ల బ్యారేజీని నవయుగ కంపెనీతో  మరమ్మతులు చేపిస్తున్నామన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జ్యుడీషియల్  విచారణ నడుస్తుందని,  ప్రస్తుతం బ్యారేజ్ మరమ్మత్తు పనులను తాము కొనసాగిస్తున్నామన్నారు. 

గతంలో విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీలో వచ్చిన నివేదిక ప్రకారం మాజీ ఇరిగేషన్ ఇంజినోర్ ఇన్ చీఫ్ ను విధుల నుండి తప్పించామని, 

జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదని అన్నారు.


94 వేల కోట్ల అప్పుతో ప్రాజెక్టు కట్టి లక్షా ఎకరాల  ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డికి 23,500 కోట్లు పెట్టి ఒక్క ఎకరా  ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని, సీతారామ ప్రాజెక్టుకు 7 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరా  ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు.

గత ప్రభుత్వం కమిషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సిరియస్ గా ఏ ఒక్క పని జరగలేదని అన్నారు.


గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి దగ్గర  38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం 

ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లే 10 వేల కోట్ల వస్తుందని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన పని లక్షల కోట్లు ఖర్చుపెట్టి కమిషన్లు తీసుకున్నారని అన్నారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో  తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు సాగులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.


కాలేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని గత ప్రభుత్వ నాయకులు తెలిపారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిస్తే అసలు జాతీయ హోదా కోసం వారు దరఖాస్తు చేయలేదని అన్నారని తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరితే 60 శాతం నిధులు కేంద్రం నుండి కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. తుమ్మిడి హట్టి నుండి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేశామని డిపిఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని ఆ విషయాన్ని తాము మ్యాని ఫెస్టో లో కూడా ప్రకటించినట్లు మంత్రి గుర్తు చేశారు.


ఎల్ అండ్ టి ఇంజనీరింగ్ చీఫ్ మాట్లాడుతూ

ఎన్ డి ఎస్ ఏ కమిటీ సూచనల మేరకు జి ఆర్ పి టెస్ట్, ఈ ఆర్ పి టెస్ట్, స్కైండ్ ఫైల్స్ ,ఇంటిగ్రెటిసిటీ, చేయమన్నారని గేట్లు ఎత్తి ఉంచాలని తెలిపారని అన్నారు.

మేడిగడ్డలో, అన్నారంలలో పనులు నడుస్తున్నాయని

సుందిళ్లలో పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని  ఆయన పేర్కొన్నారు.

వరదలు వస్తే 5 మీటర్ల ఎత్తులో జియోట్యూబ్ లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపో యొచ్చునని,  అన్నారంలో 11మీటర్లు నీటిని ఆపితే ఎత్తిపోయొవచ్చునని,  సుందిళ్లలో 9 మీటర్లు ఆపితే ఎత్తి పొయొచ్చునని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం, భూపాలపల్లి శాసనసభ్యులు  మక్కన్ సింగ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, ఓ అండ్ జనరల్ అనిల్ కుమార్,

ఓ అండ్ ఎం పరిపాలన నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటరెడ్డి, ఈ ఈ తిరుపతి రావు, ఎల్ &టి, అస్కాన్, నవయుగ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు