మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాలు
*సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా మరియు రూ. 2 లక్షల వరకు అప్పు భీమా*
అన్ని ప్రధాన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు
మహిళలు బ్యాంకులు ఇచ్చే ఋణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ది, ఆర్థికంగా ఎదగాలని *రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క* అన్నారు. శనివారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ SHG - బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. రూ. 20,000.39 కోట్లు 3,56, 273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాల క్రింద 2,53,864.సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబర్ 2023 నుండి మార్చి, 2024 వరకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేయడము జరిగినది. సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా మరియు రూ. 2 లక్షల వరకు అప్పు భీమా కల్పించడం జరిగింది. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలోని సంఘాల మహిళలకు రూ. 50 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుంది. మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడ తీసుకోవడం జరిగింది. సెక్రటేరియట్, కలెక్టర్ కార్యాలయాలలో, అన్ని ప్రధాన కార్యాలయాలలో, పర్యాటక ప్రాంతాలలో, దేవాలయాలు, బస్టాండ్లలో, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాబోయె కాలంలో క్యాంటిన్ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయడము జరిగింది. ఈ విధంగా మహిళా సంఘాలలోని మహిళలకు ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. వారు చేసే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసుకునేటందుకు వ్యక్తిగత ఋణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడము జరుగుతుంది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆ దిశగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ. 20,000 కోట్లకు అధనంగా 2,25, 000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమలో మరియు ఇతర వృత్తులలో తగిన శిక్షణ కల్పించి మెరుగైన జీవనోపాధులు పొందడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, మా ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం. ప్రతి కుటుంబానికి రూ. 500 లకే సిలిండర్ మరియు 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూ. 5 లక్షలు మరియు మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి నెల రూ. 2,500/- త్వరలో ప్రారభిస్తామని అన్నారు.
రాబోయే 5 సంవత్సరాలలో బ్యాంక్ ల ద్వారా మహిళా శక్తి పథకం క్రింద లక్ష కోట్ల ఋణాలు వివిధ ఆర్థిక కార్యక్రమాల కొరకు మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యాన్ని నిర్థారించుకోవటం జరిగింది. బ్యాంక్ వారు ఈ ఆర్థిక సంవత్సరం SHG ఋణాల మంజూరీలో పెట్టుకున్న లక్ష్యాన్ని గత సంవత్సరం లాగా అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, CGM – NABARD సుశీల చింతల, CGM – SBI, DGM - RBI, CEO - SERP, SERP – Directors, DRDOs, SERP Officers, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి అధికారులు మరియు వివిధ జిల్లాల నుండి సమావేశానికి హాజరైన మహిళా సంఘాల ప్రతినిధులు/సభ్యులు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box