అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్, (కిట్స్ వరంగల్-కిట్స్ డబ్ల్యు) వారు అధ్యాపకులు మరియు విద్యార్థులు వివిధ యోగా ఆసనాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొ.కె.అశోక రెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల మానవ శరీరంలో శక్తి, సమతుల్యత, నూతనోత్తేజం పెరుగుతాయన్నారు. మానవ ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన దైనందిన జీవితంలో సమతుల్యతను నెలకొల్పడమే యోగా అన్నారు.. యోగా శ్వాస మరియు ఆసనాలతో ముడిపడి ఉంటుంది. ఇది వెన్నునొప్పి ఉపశమనంలో సహాయపడుతుంది, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించగలదు, మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు చిరునవ్వుతో మీ శరీరాన్ని మలుచుకోవడం ద్వారా ప్రశాంతత పొందవచ్చును అని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి యోగా ఉత్తమ మార్గమన్నారు. ఇది వినూత్న నైపుణ్యాన్ని ప్రేరేపిస్తుందని సంపూర్ణమైన జీవితానికి సమగ్ర విధానం యోగా అని, అంతే కాకుండా యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప ఆరోగ్య బహుమతి అని తెలిపారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ అధ్యక్షులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కిట్స్ వరంగల్ & తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బ్యాట్) వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ వివిధ విభాగాలకు చెందిన (అధ్యాపకులు మరియు విద్యార్థులతో సహా) మొత్తం 150 మంది పైగా వారు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యం మరియు మనశ్శాంతిని మెరుగుపరచడానికి వివిధ శ్వాస పద్ధతులలో శిక్షణ లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యాపకులు వివిధ విభాగాల విభాగాధిపతులు, వివిధ విభాగాల డీన్ లు, అధ్యాపకులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పి. ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, సిబ్బంది, 120 విద్యార్థులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా రాజ్యసభ మాజి సబ్యులు కిట్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు & కిట్స్ యాజమాన్య సభ్యులు, కోశాధికారి శ్రీ. పి. నారాయణ రెడ్డి & హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే , అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్ కార్యనిర్వాహక డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అధ్యాపక & విద్యార్థుల బృందం ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box