ఇలా ఉంటే ఎలా జీ ..!?
మోతీలాల్ నెహ్రూకి
ముది మనుమడు..
భారత తొలి ప్రధానమంత్రి
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
మునిమనవడు..
తిరుగులేని మహారాజ్ని..
అపూర్వ శక్తి సంపన్నురాలు..
ఇందిరాగాంధీ మనవడు..
తానుగా పైలట్..
కొంత నెమ్మదస్థుడని
అనుకున్నా ప్రధాని పదవి
చేపట్టిన తర్వాత
మంచి పేరు తెచ్చుకున్న
రాజీవ్ గాంధీ తనయుడు..
దేశంలో ఎవరికీ లేనంత
గొప్ప ఇంట్రడక్షన్..
అయినా ఆయన చుట్టూ
అంతుబట్టని ఫిక్షన్..
అర్థం కాని డిక్షన్..
ఎవరికీ తెలియని కనెక్షన్..
పేరు రాహుల్ గాంధీ..
ఇంత చెబుతుంటే
అర్థం కాదా ఏందీ..!
అతడు మేధావా..
ఏమో..
బ్రహ్మచారా..
ఏమో..
సిన్సియరా..
ఏమో..
సీనియరా..
అదీ ఏమో..
ఎప్పుడు ఏం చేస్తాడో..
ఎప్పుడు ఎక్కడ ఉంటాడో..
ఎప్పుడు పదవి కావాలో..
ఎప్పుడు అక్కర్లేదో..
తనకే లేని క్లారిటీ..
అదెంత పిటీ..!
అమ్మ సోనియా..
ఇతడు సో..నయా..
నెహ్రూ..గాంధీ
కుటుంబంలో
పూర్వీకులకు భిన్నం..
అందుకే కెరీర్ చిన్నాభిన్నం..
నాన్న అందం లేదు..
చిన్నాన్న దూకుడు లేదు..
అమ్మ చిత్రం లేదు..
నాన్నమ్మ చిత్తం లేదు..
తాత నైజం లేదు..
ముత్తాత ఇజం లేదు..
కనీసం అక్క చరిష్మా..
అదీ కానరాదు..
బావేమో వాద్రా..
ఇతడేమో అర్థం కాని ముద్రా!?
కొన్ని సమయాల్లో మొద్దునిద్రా..!?!?
పాపం..పెద్ద కుటుంబంలో
పుట్టినా అదే వరమై..
అదే శాపమై..
రహస్యంగా చదువు..
రహస్యంగానే జీవనం..
అంతే రహస్యంగా సహజీవనం..????
ఉందని ఒప్పుకున్నా సహచరి
లోకానికి మాత్రం
బ్రహ్మచారి..
ఈ కాంగ్రెస్ సదాచారి..!
ఉన్న పదవి ఎండమావి..
ఉన్నత పదవి అందనిమావి..
అస్సలు అబ్బని
తాతముత్తాతల తావి..
కొన్ని పనులు చేసి
తనకు తానుగా
పెట్టుకునే కొరివి..
ఇలాగే ఉంటే ఎప్పటికైనా
దక్కేనా ప్రధాని పదవి..??
Happy birthday *_RAHUL.._*
_సురేష్..9948546286_
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box