జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు ఇచ్చి తీరుతం -ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్సే, ఇచ్చేదీ కాంగ్రెస్సే
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం, జూన్‌ 17:రాష్ట్రంలోని జర్నలిస్టులకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందనీ, రాబోవు రోజుల్లోనూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇండ్ల స్థలాలు ఇచ్చేది కూడా తమ  ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. 

దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాలు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డిప్యూటీ సీఎంను కలిసి  సమస్యలపై వినతపత్రం సమర్పించారు.

 జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనీ, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రభుత్వంలో  ప్రజాపాలన అమలవుతోందని  రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామి ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో నిలవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో గత ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి జర్నలిస్టులను మోసం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. మాది మాటల ప్రభుత్వం  కాదనీ, జర్నలిస్టులకు అండగా నిలుస్తామని అన్నారు.

డిమాండ్లపై వినతి పత్రం అందజేత..

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను అనేక సంవత్సరాల నుండి చేసిన పోరాటాల ఫలితంగా గత ముగ్గురు ముఖ్యమంత్రుల సాక్షిగా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు ఇప్పటం జరిగిందని వినతిపత్రం పేర్కొన్నారు. ఈ మేరకు 26.05. 2023న జి.ఓ నెం. 147 ప్రకారం 23 ఏకరాల రెండు కుంటల భూమి. జర్నలిస్టులకు కేటాయిస్తూ జి.ఓ జారీ చేశారు. ఇందులో 8 ఎకరాల రెండు కుంటల భూమికి అధిక రేట్లు ఉన్నందున ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలి. జర్నలిస్టులందరికి 23 ఏకరాలు ఇండ్ల స్థలాలుగా  పంపిణి చేయాలి. 14 ఏకరాలు మాత్రమే కేటాయిస్తామని మిగిలిన భూమిని తరువాత ఇస్తాం అని జర్నలిస్టులను మోసగించే పనిని అధికారులు చేస్తున్నారు. ఈ విధానాన్ని విరమించు కోవాలని  వినతిపత్రంలో పేర్కొన్నారు. 2024 వరకు ఉన్న అర్హులు అయిన జర్నిలిస్టులకు అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము. అక్రిడిటేషన్‌ గడువు ఈ నెల చివరితో ముగుస్తున్నందున, కార్డులను రెన్యువల్‌ చేయాలని కోరుతున్నాము. లేదా కొత్త కార్డులు ఇవ్వాలి. జర్నలిస్టుల బస్‌ పాసులను రెనువల్‌ చేయాలి. హెల్త్‌ కార్డులను పునరిద్దరించాలని, రైల్వే పాసులు పునరుద్దరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అక్రిడిటేషన్‌ కార్డు ఉన్న ప్రతీ జర్నలిస్ట్లుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్‌ పాన్లో 1/3 రాయితిని వర్తివంచేయాలని కోరారు.

 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, డిప్యూటీ సెక్రెటరీ మందటి వెంకటరమణ,  జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి విజేత, వనం నాగయ్య, మందుల ఉపేందర్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు గుద్దేటి రమేష్‌, టెంజూ పట్టణ అధ్యక్షులు యలమందల జగదీష్‌, జిల్లా నాయకులు కొరకొప్పుల రాంబాబు, ముత్యాల కోటేశ్వరరావు, బిక్కి గోపి, టీఎస్‌ చక్రవర్తి, వెంకటకృష్ణ, తోట గణేష్‌, సంతోష్‌, పిన్ని సత్యనారాయణ, ఈశ్వరి, వెంకటరెడ్డి, ఉత్కంఠం శ్రీనివాస్‌, పానకాల రావు తదితరులు పాల్గొన్నారు.

---ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు