ఘనంగా హెలెన్ కిల్లర్ 144వ జయంతి వేడుకలు -హాజరైన పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క

 


వికలాంగులను బాధ్యతగా చూడాలి

 హెలెన్ కిల్లర్ పుట్టినరోజును మానవతావాదుల పుట్టినరోజుగా జరుపుకోవాలి

ఘనంగా హెలెన్ కిల్లర్ 144వ జయంతి వేడుకలు

పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క

 పాల్గొన్న శాఖా సెక్రటరి వాకాటి కరుణ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య,  

హైదరాబాద్,జూన్27,2024: సమస్త వికలాంగులు, మానవతావాదుల పుట్టినరోజుగా హెలెన్ కిల్లర్ పుట్టినరోజు జరుపుకోవాలని, హెలెన్ కిల్లర్ ఆదర్శంగా ప్రతిఒక్కరూ వికలాంగులను బాధ్యతగా చూసి గౌరవించి వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని పంచాయతీరాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రలు సీతక్క అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ లో సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ మలక్పేట వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో భారతదేశంలోనే మొదటిసారిగా జరిగిన హెలెన్ కిల్లర్ 144 వ జయంతిలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని హెలెన్ కిల్లర్ విగ్రహ ఆవిష్కరణ చేసి మాట్లాడారు. 

 రవీంద్ర భారతిలో జరిగిన హెలెన్ కిల్లర్ జయంతి వేడుకల్లో  వికలాంగుల సంక్షేమ శాఖ సీతక్కకు 

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. 



    ఈ సందర్భంగా మంత్రి వర్యులు సీతక్క గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వికలాంగులను పూర్తీగా విస్మరించి ఓక కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ ఇస్తే నేటి ప్రభుత్వం 75 కోట్ల బడ్జెట్ ఇచ్చిందన్నారు. వికలాంగులను బాధ్యతగా చూడలేని వారు,వికలాంగులను స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకునే వారు నిజమైన వికలాంగులని, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చాక ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వికలాంగులకి ఉన్నత విద్య లో 5 శాతం రిజర్వేషన్, ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చామని, ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నీ సంక్షేమ పథకాలలో 5 శాతం, ఉద్యోగాలలో 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పారు. 



  వికలాంగులకు కోసం ప్రత్యేకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన

స్టాళ్లను పరిశీలించి వికలాంగుల పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు 

వికలాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన వెబ్ సైట్ ను విడుదల చేసిన అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన వికలాంగులకి మెమొంటులోలు ఇచ్చి హెలెన్ కిల్లర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వికలాంగులకు తినిపించారు.

  ఈ సందర్భంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ము త్తినేని వీరయ్యను శాలువాతో సత్కరించారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే వికలాంగ సోదరి రజినీకి ఉద్యోగం ఇచ్చారని, కోర్టు ఉద్యోగాలలో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గత ప్రభుత్వము హయాంలో సదరం స్లాట్ కి వికలాంగులు చాలా ఇబ్బందులు పడే వారని కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి  సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని సదరం స్లాట్ నీ సులభతరం చేసి వికలాంగులకి పెద్దన్నగా నిలబడ్డాడనీ అన్నారు. రాబోయే కాలంలో వికలాంగులకు సంబంధించి అన్నీ సంక్షేమ కార్యక్రమాలు అధ్బుతంగా జరుగుతాయని, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోను సంపూర్ణంగా అమలు పరుస్తామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమమే ధ్యేయంగా పనీ చెసే ప్రభుత్వమనీ అన్నారు. 

   ఈ కార్యక్రమంలో శాఖ సెక్రటరి వాకాటి కరుణ, డైరెక్టర్ శైలజ గారు , వికలాంగ సంఘాల నాయకులు, వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వికలాంగులు పాల్గొన్నారు.

---Ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు