భాద్యతలు స్వీకరించిన హన్మకొండ, వరంగల్ కలెక్టర్ల



హనుమకొండ 

హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి.ప్రావీణ్య ఐ.ఏ.ఏస్

సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ పై వెళ్ళగా ఆ స్థానంలో పి.ప్రావిణ్య ఐ.ఏ.ఏస్ హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3.గంటలకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా (లోకల్ బాడీస్) , వెంకట్ రెడ్డి (రెవెన్యూ) , డి.ఆర్.ఓ. వై.వి గణేష్  పుష్పగిచ్చాలతో స్వాగతం పలికారు.



వరంగల్ 

వరంగల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సత్య శారదదేవి....

శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా, రెవిన్యూ  అధికారులు, సిబ్బంది*

వరంగల్ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ సత్య శారదదేవి ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో  బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, డిపిఆర్ఓ అయ్యుబ్ అలీ, డి ఈ ఓ వాసంతి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత,  ఆర్డీవోలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్ డి ఎం హవేలీ రాజు,   కలెక్టరేట్ ఏవోలు శ్రీకాంత్, అబిద్ అలీ,   తహసిల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, ఫణి కుమార్, విజయ్, రవిచంద్ర రెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్, నాయబ్ తహసీల్దార్ లు, సిబ్బంది తదితరులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.


అనంతరం జిల్లా అధికారులతో శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.త్వరలో శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తానని , జిల్లా అధికారుల  సమన్వయంతో అభివృద్ధి లో  వరంగల్ జిల్లాను  అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు