చట్టవ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

 


చట్టవ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

 

ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భస్రావాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్ట్ చేసిన వారిలో మహిళలు కూడ వున్నారు.

ఈ ముఠా నుండి పోలీసులు స్కానింగ్ మిషన్, ద్విచక్ర వాహనం మరియు మూడు సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 

1) బస్కే స్రవంతి w/o ప్రవీణ్ కుమార్, వయస్సు: 32 సంవత్సరాలు, కులం:మాదిగ, వృత్తి: నర్సు R/o  కడిపికొండ, కాజీపేట.

2) కాసిరాజు దిలీప్ S/o రాజయ్య, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: రజక, వృత్తి: ప్రవేట్ జాబ్, R/o పత్తిపల్లి గ్రామం, ములుగు మండలం&జిల్లా, ప్రస్తుతము రాయపుర, హన్మకొండ

3) జంగా రాజమని w/o కనకయ్య, వయస్సు: 64సంవత్సరాలు, కులం:యాదవ, వృత్తి: ఆయమ్మ, R/o  కుమారపల్లి, హన్మకొండ.

4) ఏకుల నరేష్ S/o కొమురయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్తి: ల్యాబ్టెక్నీషియన్, R/o కాశీబుగ్గ, వరంగల్

కు చెందిన వారు వున్నారు.

ఈ అరెస్ట్ సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోని  ప్రధాన నిందితురాలు బస్కె స్రవంతి గతంలో హనుమకొండలో  ఓ ఆసుపత్రి లో  నర్సుగా  పనిచేసిందని  రెండు నెలల క్రితం మరో నిందితురాలు సమీప బంధువులు  లింగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా మరో నిందితురాలు రాజమణి  స్రవంతిని కోరారని తెలిపారు. 

నిందితురాలు స్రవంతి హనుమకొండలో స్థానికంగా ఎలాంటి అర్హతలు అనుతులు  లేకుండా రహస్యంగా స్కానింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి  మరో నిందితుడు కాసిరాజు దిలీప్ సహకారంతో హనుమకొండ వేయిస్థంబాల గుడి ప్రాంతంలో సదరు బాధిత మహిళకు చట్ట వ్యతిరేకం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. గర్భంలో  అమ్మాయిగా నిర్ధారణ కావడంతో మహిళకు గర్భస్రావం చేయించాల్సిందిగా నిందితురాలు రాజమణి స్రవంతిని కోరడంతో కాశిబుగ్గ లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో నిందితుడు నరేష్ వద్ద గర్భస్రావం అయ్యేందుకు టాబ్లెట్  తీసుకోని స్రవంతి బాధిత మహిళకు ఇవ్వడంతో ఈ మాత్రను వేసుకున్న బాధిత మహిళకు ఆరోగ్యం క్షిణించడంతో  మహిళ చికిత్స అందించడం కోసం నిందితురాలు ఇద్దరు బాధిత మహిళను హనుమకొండ లోని స్థానిక ఆసుపత్రి లో చేర్పించి అక్కడి నుండి తప్పించుకున్నారని తెలిపారు. జరిగిన విషయం డాక్టర్ కు బాధిత మహిళ తెలిపడంతో   డాక్టర్ జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో వైద్యాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన హనుమకొండ పోలీసులు చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి చేసి అక్రంగా గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు

. ఈ ముఠాలోని ప్రధాన నిందితురాలు స్రవంతి గతంలో కూడ ఇదే తరహాలో అక్రమంగా గర్భస్రావానికి పాల్పడ్డారని ఆమెపై ఐదు కేసులు నమోదు చేసి జైళుకు పంపించామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు