ఒక దేశాన్ని నాశ‌నం చేయాలంటే ఆట‌మ్ బాంబులు అవ‌స‌రం లేదు - సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

 

  • దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష

  •  నీట్ పరీక్షల్లో జరిగిన అవక తవకల దేశ వ్యాప్తంగా కల కలం రేపుతున్నాయి. తొలుత అసలు ఏ అక్రమాలు జరగలేదన్న కేంద్ర ప్రబుత్వం ఆఖరికిఅక్రమాలు జరిగినట్లు అంగీక రిచింది. బిజెపి కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న గుజరాజ్, బీహార్ రాష్ట్రాలలో ఈ అక్రమాలు చోటు చేసుకోవడం ఆ ప్రభుత్వాల వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి.
  • లక్షలాది మంది విద్యార్థల జీవితాలతో ముడిపడిఉన్న నీట్ పరీక్షలపై అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. 
  • అక్రమాలు జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • సిబిఐ మాజి డాయింట్ డైరెక్టర్ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు


నీట్‌ పేప‌ర్ లీక్ అయ్యిందంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న వేళ సీబీఐ మాజీ జేడీ, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఓ ఆస‌క్తిక‌రమైన ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశ‌నం చేయాలంటే ఆట‌మ్ బాంబులు అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌ట అదే నాశ‌నం అవుతుంది.

 అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగులు చ‌నిపోతారు అంటూ ప‌లు ఉదాహరణలను  దక్షిణాఫ్రికా లోని ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం ఎదుట వేళ్లాడదీసారని  పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.  




 దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

 నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీక‌రించారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయ పరంగా దుమారం రేపుతోంది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు