*ఏం చేసినా అఖండమే..!*


బహిరంగ సభల్లో

తడుముకునే మాట..

సినిమాల్లో ప్రతి మాట 

ఓ తూటా..

అదే బాలకృష్ణ బాట..

పది మందితో రా..

పదీ పదీ పెంచుకుంటూ రా..

నాతో మటాడేటప్పుడు ఒక్కవైపే చూడు..

రెండో వైపు చూడకు..

తట్టుకోలేవు..

ప్లేస్ నువ్వు చెప్పినా..

నన్ను చెప్పమన్నా..

టైం నువ్వు చెప్పినా..

నన్ను చెప్పమన్నా..

తొడకొట్టి మరీ 

ఇలా చెప్పే సింహా..

ఈసారి పుట్టేవాడు 

చచ్చేవాడు కాడు..

చంపేవాడు కావాలన్న 

లక్ష్మీ నరసింహ..

తెలుగు సినిమాకి 

ఫాక్షనిజాన్ని పరిచయం 

చేసిన సమరసింహ..

నందమూరి ఇంటి పేరైనా

సింహాన్ని ఒంటి పేరుగా మార్చుకున్న జైసింహ..

నటరత్న వారసుడిగా ప్రవేశం..

యువరత్నగా పరకాయ ప్రవేశం

కృష్ణా జిల్లా అభినయపరవశం

రాయలసీమ ఆవేశం..

మొత్తానికి తండ్రి తర్వాత 

రాముడైనా..కృష్ణుడైనా 

తానే ధరించి తరించిన

"అఖండ"అవతారం..!


తండ్రి వారసత్వం..

తాతమ్మ కల..

సినీ పద్మవ్యూహంలో

అభిమన్యుడిగా ఎంట్రీ..

అంచెలంచెలుగా స్టార్ డం..

అయ్య బాటలో బాలయ్య

జాన"పధం"లో...

పెద్దాయన సినిమాలు 

మిక్స్ చేసి

భైరవద్వీపంగా ఫిక్స్..

సింగీతం ట్రిక్స్..

కత్తివీరుడిగాను సక్సెస్

తుంబుర నారద 

నాదామృతం అంటూ 

శివశంకరీ వైపూ ఓ పరుగు

బాలయ్య అభిరుచి జిలుగు!


నాన్నలాగే ముక్కుసూటి..

పురాణాల్లో ధాటి..

ఉచ్చారణలో మేటి..

అభినయంలో ఘనాపాటి..

రాజకీయంలోనూ  అడుగులు

ఒత్తేది లేదు ఎవరి 

అడుగులకు మడుగులు..

నచ్చింది చెయ్యడం

నచ్చినట్టు వెళ్ళడం..

ఆ వెళ్లే దారి పది మందికి నచ్చేట్టు మసలడం..

అదే రాజకీయంలో 

బాలయ్య స్టార్ డం..

ఢమా డం..!

నచ్చనిది ఎవరు చేసినా గాని

దబ్బిడి దిబ్బిడే..!!

ఇప్పుడిక తెలుగుదేశం 

ఘనవిజయంతో

ఆయన అన్ స్టాపబుల్..!!!


బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలతో..


*ఎలిశెట్టి సురేష్ కుమార్*

      9948646286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు