అది పులి కాదు - పెంపుడు పిల్లి ఢిల్లీ పోలీసుల క్లారిటి

 

అది పులి కాదు - పెంపుడు పిల్లి  ఢిల్లీ పోలీసుల క్లారిటి

రాష్ట్ర పతి భవన్ వద్ద ప్రధానమంత్రి సహాకేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చిరుతను పోలిన  అనుమానాస్పద జంతువు  సంచరించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను ఢిల్లీ పోలీసులు కొట్టి పారేసారు. అది పులు కాదని ఇంట్లో పెంపకపు పిల్లి అని క్లారిటి ఇచ్చి  వైరల్ కు తెరదించారు.

అడవి జంతువును పోలిన ఆకారం లో కనిపించడంతో చాలా మంది కంగారు పడ్డారు. అదేంటి రాష్ట్ర పతి భవన్ లో పులిని కాని చిరుతను కాని పెంచుతున్నారా అనే అనుమానాలు కూడ కలిగాయి. 

ఎంపి దుర్గాదాస్ కేంద్ర మంత్రిగా  ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా దారంగా రాష్ట్రపతి భవన్ ప్రధాన గుమ్మం ముందు జంతువు సంచారం కనిపించింది.  అది అచ్చం పులిని పోలిన ఆకారంలో ఉండడంతో దాన్ని క్లోజప్ చేసి వీడియోలు వైరల్ చేసారు.

రోజంతా ఈ వార్తలు సోషల్ మీడియలో  బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్త ఢిల్లా పోలీసుల వరకు చేరి సోమవారం సాంత్రం ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. అది పులి కాదు ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి అని స్ఫష్టం చేయడంతో ఊహాగానాలకు తెరపడింది. 

దయ చేసి ఇలాంటి పనికి మాలిన పుకార్లను నమ్మవద్దు  ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కెమెరాలకు చిక్కిన జంతువు పులి కాదు పిల్లి  అంటూ పోలీసులు వివరించారు.

మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రను తిరగ రాసాడు. జవహర్ లాల్ నెహ్రూ తప్ప ఇప్పటి వరకు ఎవరూ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయ లేదు. నరేంద్ర మోది సహా 30 మంది ఎంపీలు  కాబినెట్ హోదా  మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐదుగురు స్వతంత్ర మంత్రులు కాగా 36 మంది  రాష్ట్ర మంత్రులతో కల్సి మొత్తం మంత్రి వర్గం జాబితా 71 కు  చేరింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు