నగరంలో భారీ వర్షాలతో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడం ఎలా ?
మున్సిపల్, పోలీస్, ఫైర్, వాతావరణ శాఖల అధికారులతో సి.ఎస్ సమీక్ష
హైదరాబాద్, జూన్ 7 :: రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఆకస్మికంగా కుండపోత వర్షం కురిస్తే కలిగే ట్రాఫిక్ జామ్ లను నివారించడం, Stagnation ఏర్పడకుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి డీజీపీ రవీ గుప్తా, విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగి రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఒక్కసారిగా కురిసే భారీ వర్షాల వల్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వీటిని నివారించడం, పూర్తిగా తగ్గించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వెదర్ ఫోర్ కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సమాజాల వాట్సాప్ గ్రూపులకు పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియ చేయాలని సూచించారు. వర్షాలకు సంబందించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకందించేదుకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 134 ప్రాంతాలను Vulnerable locations గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతాలలో తిరిగి Stagnation జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని కోరారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, పోలీస్, ఎస్.పీ.డీ.సి.ఎల్ తదితర శాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఈ వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి, వీటి నివారణకు తగు సూచనలను చేయాలని సి.ఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు పలు ప్రాంతాలలో భారీ ప్రమాణం కలిగిన నీటి నిల్వ సంపు లను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలియచేసారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరచడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని శాంతి కుమారి కోరారు.
నగరంలో ప్రధానంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాలలో రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే, వాటిని వెంటనే తొలగించడానికి అదనపు క్రేన్ లను అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో ఆకస్మిక వర్షాల వల్ల, నీటి నిల్వలు, వరదల వల్ల ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా తక్షణమే స్పందించడానికి జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్పీడీసీఎల్, పోలీస్ లకు చెందిన 630 మాన్సూన్ సహాయక బృందాలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box