అంగన్వాడి ఏకరూప దుస్తులను జూలై 5వ తేదీ వరకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర సూచించారు.
శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ , డి ఆర్ డి ఏ శ్రీనివాస్ కుమార్ తో కలిసి పాల్సాబ్ పల్లి గ్రామంలో మహిళ సంఘ సభ్యులు సిద్ధం చేస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను ఆసక్తి కలిగిన మహిళ స్వయం సంఘాల సభ్యులకు అందించడం జరిగిందని తెలిపారు.
ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలని , ఒక క్రమ పద్ధతిలో కుట్టే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించిన గడువులోపు అంగన్వాడి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిపిఎం , ఏపీఎం, తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box