వరంగల్ ను హైదరాబాద్ సరసన నిలబెడతాం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

                                      


 ప్రజల నమ్మకాన్ని 

వమ్ము చేయబోము..

సుపరిపాలన అందించి తీరుతాం .

అభివృద్ధికి, ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి..

అడిగిన అన్ని నిధులు ఇస్తాం..

పనులు చేయించండి..

వరంగల్ ను 

హైదరాబాద్ సరసన నిలబెడుతాం..

సమర్థత ఆధారంగానే 

అధికారులకు పోస్టింగులు..

రాజకీయ ప్రేరేపిత 

బదిలీలు ఉండవు..




ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని, సుపరిపాలన అందించి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసము అహర్నిశలు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలని సూచించారు. 

శనివారం సాయంత్రం హన్మకొండ కలెక్టరేట్ సమావేశభాల్లో వరంగల్ మహానగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ సరసన నిలబెడుతామని పేర్కొన్నారు. అడిగిన అన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి వరంగల్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్ కు వారసత్వంగా గొప్ప పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క, కాకతీయులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర వరంగల్ కు ఉందని గుర్తు చేశారు. వరంగల్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హెల్త్ సిటీ ఏకో టూరిజం, వివిధ విభాగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రక్షిస్తున్నామని వెల్లడించారు. అధికారులు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పని చేయాలని సూచించారు. సమర్థత ఆధారంగానే బదిలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రేరేపిత బదిలీలు ఉండబోవని స్పష్టం చేశారు. అధికారులు భయపడే వలసిన అవసరం లేదని, ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో త్వరలో సమావేశం నిర్వహించుకొని వరంగల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు. తాను సమీక్ష ప్రాథమికంగానే నిర్వహించానని, 45 రోజులకు వచ్చి పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన అందిస్తామని పేర్కొన్నారు.



ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సీతక్క దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, సిపి అంబ కిషోర్ జా మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఐఏఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు