సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పి.వి.- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పి.వి. చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి పి.వి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box