చెంచు మహిళపై మధ్యయుగాల నాటి దాష్ఠీకం - మాటల్లో చెప్పలేని చిత్ర హింసలు

 

ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. 
వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. 
మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.
కౌలుదార్ల దుర్మార్గం.. భూమిని కౌలుకిచ్చి
వారి దగ్గరే పనికి వెళుతున్న మహిళ
భర్తతో గొడవపడి మరో గ్రామంలో తల దాచుకున్న మహిళ
చెంచు మహిళపై మధ్యయుగాల నాటి దాష్ఠీకం
   మాటల్లో చెప్పలేని చిత్ర హింసలు
మర్మాంగాలపై డీజీల్‌.. అగ్గిపుల్ల గీసి చురకలు..
నాగర్‌కర్నూల్‌లో ఘోరం.. అదుపులో నలుగురు?
ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో జరిగిన ఘోరం పై మండిపడుతున్న పౌరహక్కుల సంఘాలు
 

నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత జిల్లా నాగర్ కర్నూల్ లో ఓ చెంచు మహిళను కౌలు రైతులు అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టారు. మహిళను నిర్భంధించి మధ్యయుగాల నాటి దాష్టీకానికి తెగబడ్డారు.  ఆంధ్రజ్యోతితో పాటు ఇతర పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం  ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.

 నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె పొలాన్ని కౌలుకు తీసుకొని.. ఆమెతోనే కూలీ పనులు చేయిస్తూ.. ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులుగా ఆమె పనులకు రాకపోవడంతో ఆగ్రహం చెంది ఈ కారణంతోనే ఆమెపై  వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత కుటుంబానికి చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన బండి శివమ్మ, బండి శివుడు, బండి వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకున్నారు. అక్కడే బాధిత మహిళ, భర్తతో కలిసి రోజూ వారి పొలాల్లో పనులు చేస్తోంది. పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె అలిగి పుట్టిల్లయిన తీర్నాంపల్లికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లి పోయింది.


అయితే ఆమె ఆ గ్రామానికి కాకుండా పరిచయస్తులు ఉన్న చుక్కాయిపల్లి గ్రామానికి వెళ్లింది. భార్య గురించి అత్తామామలకు భర్త ఫోన్‌ చేసి అడగ్గా, ఆమె తమ ఇంటికి రాలేదని వారు చెప్పారు. దీంతో భార్య గురించి ఆందోళన చెందుతుండగానే మరోవైపు కౌలుదార్లు అయిన శివమ్మ, వెంకటేశ్వర్లు, శివుడు.. ఆమె ఆచూకీని గుర్తించి చుక్కాయిపల్లికి వెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి గ్రామంలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను నిర్బధించి దాష్టీకాలకు పాల్పడ్డారు. మరోవైపు.. కుటుంబ నియంత్రణ గురించి చెంచు నాయకులు మొలచింతపల్లి గ్రామానికొచ్చి ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తుండగా ఈ ఘోరం వెలుగుచూసింది. చెంచు నాయకులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారొచ్చి బాధిత మహిళను కాపాడారు.



ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులు వెంకటేశ్వర్లు, శివుడు, శివమ్మపై కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం ప్రతినిధులు కొల్లాపూర్‌ డీఎస్పీ శ్రీనివా్‌సకు వినిపత్రమిచ్చారు. చెంచు మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మంత్రి జూపల్లి ఆదేశించారు. చెంచు మహిళపై దాడి ఘటనలో ముగ్గురు నిందితులతో పాటు బాధితురాలి అక్క, బావ  కూడా ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.


మండిపడుతున్న పౌరహక్కుల సంఘాలు

చెంచు మహిళపై జరిగిన అఘాయిత్యం పై ప్రజా సంఘాలు, పౌరహ్కకుల సంఘాలు మండి పడుతున్నాయి. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఇలా జరగడం గోరమని నిందితులపై ఖఠిన చర్యులు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. పౌర హక్కుల సంఘం అధ్వర్యంలో నిజ నిర్దారణ కమిటి శుక్రవారం  నాగర్ కర్నూల్ జిల్లాకు బయలు దేరింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు