మామూలు గౌరవం కాదిది..!


మామూలు గౌరవం కాదిది..!


చంద్రబాబు మాట మార్చేస్తారు..

గారడీ చేస్తారు..

బురిడీ కొట్టిస్తారు..


ఏదో ఒక రోజున పవన్ కళ్యాణ్ కి సైతం దెబ్బ కొడతారు..


ఇలా అన్నవారికి సరైన సమాధానం చెబుతూ

తెలుగుదేశం అధినేత..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం..

ఆయనకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పట్ల ఏర్పడిన ప్రగాఢ విశ్వాసానికి..అనుబంధానికి

ప్రతీకగా నిలిచింది..!


కాదా మరి..

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

ఫోటో పెట్టాలన్న ఆదేశం..

తెలుగుదేశం.. జనసేన

మైత్రిలో పతాక సన్నివేశం..!


ఎట్టి పరిస్థితుల్లోనూ చలించని

చంద్రబాబు నాయుడు..

పవన్ అన్నట్టు మొన్న జగన్ సర్కార్ హయాంలో అరెస్టు అయినప్పుడు నిజంగా నలిగిపోయారు.. నలిగిపోయారు..!


రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలను.. డక్కా మొక్కీలను

చూసిన చంద్రబాబుకు బాగా తెలుసు.. మొన్నటి ఎన్నికల్లో

తనకు..తన పార్టీకి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్య(శ)క్తి

అండగా నిలిచి ఉండకపోతే

అంతటి ఘన విజయం

కాదు కదా గెలుపు కూడా సందేహమే..పవన్ లేకపోతే

బిజెపి మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి లభించేది కాదనే సంగతి అందరికీ తెలిసిందే..


టిడిపి. బిజెపి అన్నవి రెండు పెద్ద పార్టీలు అనే విషయాన్ని పక్కన బెడితే 

ఇటు బాబు..అటు మోడీ 

అనే భిన్న ధృవాల మధ్య వారధిగా నిలిచి

పెద్ద కథలో తాను నాయకుడుగా నిలబడ్డారు

పవన్ కళ్యాణ్..ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు..

ఇంకెన్నో అవమానాలు..

చలించక ఉన్నాడు కొండలా..

*_జగన్ పాలిట గుదిబండలా..!_*


ఇవన్నీ బాగా గుర్తెరిగిన

చంద్రబాబు నాయుడు 

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత

పవన్ కళ్యాణ్ విషయంలో

సముచిత రీతిలో స్పందించి

అందరూ ఊహించిన విధంగా

జనసేనానిని ఉపముఖ్యమంత్రి పదవితో సత్కరించి ఎవరూ ఊహించని రీతిలో పవన్ 

ఫోటో తన చిత్రపటం పక్కన 

ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో  పెట్టేలా

ఆదేశాలు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

*_ఇది చరిత్రే..!_*


జగన్ హయాంలో 

ఉప ముఖ్యమంత్రులకు 

ఏపాటి అధికారాలు..

గౌరవం ఉండేవో 

చూసాం..విన్నాం..!


సత్తిబాబు అంతటి సీనియర్ మంత్రికే జగన్ పక్కన నిలుచుని ఉండి ఫోటోలు దిగిన

చేదు అనుభవం తప్పలేదు..

నాకు తెలిసి..

ఇలా ఉప ముఖ్యమంత్రి ఫోటో విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం దేశంలో ఇదే మొదటిసారి.. అలాంటి నిర్ణయం తీసుకున్న రికార్డు

చంద్రబాబుకి దక్కితే..

అటువంటి గౌరవం పవన్

సొంతమైంది..!


ఇక్కడ మరోమాట..

చాలా మంది రకరకాలుగా

చెప్పిందే..


మొన్న టిడిపి శాసనసభ

నాయకుడి ఎంపిక సందర్భంగా జరిగిన సభైతేనేమి..తరవాత

మోడీ సమక్షంలో జరిగిన 

ప్రమాణస్వీకార ఉత్సవమైతేనేమి 

ఒక పండగలా.. 

కుటుంబ వేడుకలా జరగడానికి కూడా పవన్ కళ్యాణ్ 

ప్రధాన కారకుడు అన్నది నిస్సందేహం.

సాక్షాత్తు ప్రధాని మోడీ..

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర రాజకీయ దిగ్గజాలు.. రజనీకాంత్.. చిరంజీవి..బాలకృష్ణ వంటి క్రేజీలు..ఎందరో ఎమ్మెల్యేలు..

హేమాహేమీలు కొలువై ఉన్న 

ఆ వేడుకలో 

కేంద్ర బిందువు జనసేనాని..

చంద్రబాబుతో ఆత్మీయత..

లోకేష్ ఆయనకు చేసిన పాదాభివందనం..

పవన్ పట్ల మంత్రుల అభిమానం..

పరాకాష్టగా ప్రధాని చెయ్యిని చిన్నపిల్లాడిలా పట్టుకుని 

అన్న చిరంజీవి దగ్గరికి 

తీసుకు రావడం..

ఏ దర్శకుడూ తీయని

అద్భుత సన్నివేశమాలిక..

పవన్ అభిమానులకే కాక కోట్లాది జనాలకి నచ్చిన 

అత్యంత సహజ..కన్నుల కింపైన దృశ్యమాలిక..

ఈ వీడియోలు 

_వైరల్ కే ప్లూరల్.._

_లైకును మించిన కిక్కు.._

ఒక సంచలనం..

అదే అదే 

*_పవన్ కల్యాణం..!_*


       *_సురేష్.. జర్నలిస్ట్_*

            9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు