కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను మునిసిపాలిటీలలో విలీనం చేసే విధి విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ గిరిధర్ వీడియో కాన్ఫరెన్స్


సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే కేంద్రప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతిని తెలిపిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆమె తెలియజేశారు.

 కంటోన్మెంట్ ల పరిధిలో ఉన్న సివిల్ ప్రాంతాలను  మునిసిపాలిటీలలో విలీనం చేసే విధి విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ గిరిధర్ మంగళవారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

     బ్రిటిష్ పాలన నుండి నేటి వరకు భారతదేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున కంటోన్మెంట్ ఏరియా లోని సివిల్ ప్రాంతాలను  మున్సిపాలిటీలలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గిరిధర్ కోరారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే కేంద్రప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతిని తెలిపిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆమె తెలియజేశారు.  సివిల్ ఏరియాల తొలగింపు విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా పంచుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆమె తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మున్సిపల్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు