హైదరాబాద్, జూన్, 19: బేగంపేట లోని మేరిగోల్డ్ హోటల్ లో నిర్వహించిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు తోడుపాడాలని కోరారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో 6,415 వివిధ బ్యాంకు శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికి, గ్రామీణ ప్రాంతాలలో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించే విధంగా LWE ప్రభావిత భద్రాద్రి జిల్లాలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులో తీసుకొచ్చారని తెలిసింది. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను " అని అన్నారు.
భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యురిటీ / ఇన్సురెన్స్ పథకాలకు PMSBY ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజనలాంటి పథకాల క్రింద కేవలము enrolment status మాత్రమే చూపెడ్తున్నారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కానీ, ఆ త్రైమాసికంలో కానీ ఎంతమందికి లబ్ధి చేకూరిందో వంటివి రిపోర్టులో పెట్టలేదు. ముఖ్యంగా చాలామంది వినియోగదారుల కుటుంబాలలో ఎవరైనా అకాల మరణం సంభవించినపుడు వారి కుటుంబాలను ఆదుకునే పథకాలు ఉన్నవన్న విషయం చాలామందికి తెలియదు.
ALSO READ పసుపు బిల్ల ధరించి ఆపీసుకు వెళితే టీ తాగించి సగౌరవంగా పనులు చేసి పెడతారు..మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయరంగానికి సంబంధించి, గత సంవత్సరం కంటే 13,000 కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికి చిన్న, సన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదు. తెలంగాణ రాష్ట్రములో 73.11 శాతం భూములు చిన్న,సన్నకారు రైతుల వద్దనే ఉన్నాయి. కావున RBI విధించిన పరిమితిని మీరు yardstick గా కాకుండా, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన అవశ్యకత ఉన్నది. అదేవిధంగా వ్యవసాయరంగములో మౌళికసదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాల శాతము కూడా (29.29), 100 శాతం చేరుకోవల్సిన అవసరం ఉన్నది.
అదేవిధంగా బ్యాంకు కంట్రోలర్స్ అందరికి మా విజ్ఙప్తి ఏమంటే మీరిచ్చే పంటరుణాల గ్రహితల వివరాలు సమగ్రంగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా అన్ని శాఖల వారికి స్పష్టమైన ఆదేశాలివ్వండి. వారి వివరాలు సమగ్రంగా లేకపోవడం వలన వారికి ప్రభుత్వం ద్వారా అందే సహాయం కోల్పోతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైనది. రాష్ట్రప్రభుత్వము తరపున 90 శాతం సబ్సిడి డ్రిప్ పైన మరియు ఆయిల్ పామ్ పిలకలపై ఇస్తున్నాయి. గత రెండు మూడు రోజుల్లో దాదాపు 100.76 కోట్ల సబ్సిడీ కూడా రైతులకు డ్రిప్ కంపెనీలకు విడుదల చేయడం జరిగింది. 59,261 ఎకరాల ఆయిల్ పామ్ సాగులోకి కొత్తగా తెచ్చాం RIDF క్రింద NABARD వారు 221.00 కోట్లు రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 18,654 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపడితే కేవలము 50 లేదా అంతకంటే తక్కువ రైతులకు రుణాలు మంజూరు చేయడం శోచనీయం. కావున బ్యాంకులు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి, ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది.
ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ క్రింద NABARD 10.07 కోట్ల రుపాయలను TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్, బుగ్గపాడు గ్రామంలో ఫుడ్ పార్కుకు విడుదల చేసిన తరువాత, అటువంటి ఫుడ్ పార్కులను కానీ, ప్రాసెసింగ్ యూనిట్ లకు కానీ, ఎక్కడా రుణాలు మంజూరు చేసిన సందర్భము లేదు. కావునా ఈ విషయము మీద దృష్టి పెట్టాల్సిందిగా బ్యాంకర్లకు విజ్ఙప్తి చేయుచున్నాను. అదేవిధంగా వ్యవసాయరంగముతో పాటు అనుబంధ రంగాలలో కూడా రుణాలు అధిక మొత్తంలో మంజూరు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటు అందించవలసిందిగా విజ్ఙప్తి చేస్తున్నాను’’ అని అన్నారు.
అంతేకాకుండా దశాబ్దాలుగా, రాష్ట్రంలో మరియు కేంద్రంలోని ప్రభుత్వాలు రైతులకు అత్యంత ముఖ్యమైన ఇన్‌పుట్, ఫైనాన్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయని మీకు తెలుసు. పగలనక, రాత్రనక వేడి మరియు దుమ్ములో పనిచేసుకుంటూ అన్ని రకాల కష్టాలను, నష్టాలను ఎదుర్కుంటున్న రైతులు, వారికీ ఉద్దేశించిన ప్రయోజనాలు మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలేదా?.
ఇది బ్యాంకింగ్ లీడర్‌లు మరియు ఫైనాన్షియల్ సెక్టార్‌లోని మీరందరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. రైతుల మేలు కోసం కొత్త ప్రారంభాన్ని రూపొందించడానికి ఆలోచనలు, పరిష్కారాలతో రండి. మీ బ్యాంకింగ్ కార్యకలాపాల యొక్క స్ఫూర్తిని మరియు వ్యవసాయ/గ్రామీణ బ్యాంకింగ్ యొక్క ఉద్దేశ్యాన్ని కోల్పోవద్దు అని నా అభిప్రాయం. పథకాల విధానాలు నియమాలు మరియు నిబంధనల పేరుతో అసలు ఉద్దేశాన్ని మరవకండి. అన్నదాతను ఫైనాన్స్ తో ఎలా ఎలా శక్తివంతం చేయవచ్చో దయచేసి ఆలోచించండి.. రైతులు మీ బ్యాంకులు మరియు ప్రభుత్వం యొక్క వివిధ పథకాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో వారికి తెలియజేయండి. ఈ ప్రక్రియలో, మీకు మద్దతు ఇవ్వడానికి మా ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మా ప్రభుత్వం మీకు హృదయపూర్వక ప్రయత్నాలు మరియు మద్దతు కోరుకుంటుంది. ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల శ్రీ భట్టి విక్రమార్క గారు కూడా పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box