కమీషన్ పై ఎదురు దాడి సరైంది కాదు- బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మన్

 


విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల విచారణ కమీషన్ పై కెసిఆర్ ఎదురు దాడి సరైంది కాదు


రాష్ర్టంలో గత ప్రభుత్వ హయాంలో  జరిగిన విద్యుత్  కొనుగోళ్ల అక్రమాలు  విచారించేందుకు  రిటైర్డ్ జస్టిస్ నర్సింహారెడ్డి అధ్వర్యంలో  ఏర్పాటైన కమీషన్ పై మాజి సిఎం కెసిఆర్ విచారణకు సహకరించకుండా ఎదురు దాడికి దిగడా్నని బిజెపి జాతీయ నేత డాక్టర్ కె లక్ష్మన్ తప్పు పట్టారు.

విద్యుత్ కొనుగోళ్ళలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని తమ పార్టి కూడ గతంలో  ఈ విషయంపై ప్రశ్నించిందని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన రిటైర్డ్ జస్టిస్ నర్సింహారెడ్డి కమీషన్ ఎదుట హాజరై విచారణలో తన వాదనలు వినిపించి నిర్దోశిత్వం నిరూపించు కోవాల్సిన కెసిఆర్ అవన్ని పక్కన పెట్టి ఎదురు దాడికి దిగడం సరైందని కాదని అన్నారు. కెసిఆర్ కు ఎదురు దాడి చేయడం కొత్తేమి కాదని తప్పుల మీద తప్పులు చేసి అక్రమాలకు పాల్పడి ప్రశ్నించే వారిపై ఎదురు దాడి చేయడం ఆయనకు అలవాటని అన్నారు. కమీషన్ పట్ల వాస్తవంగా అభ్యంతరాలుంటే న్యాయపరంగా ఎదుర్కోవాలని అన్నారు.


కాలయాపనతో బిఆర్ఎస్ నాయకులను లొంగ తీసుకునే పనిలో సిఎం రేవంత్ రెడ్డి 

సిఎం రేవంత్ రెడ్డిబిఆర్ఎస్ పార్టి నేతలను లొంగ దీసుకునే పనిలో ఉన్నారని నిజంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చిత్త శుద్ది లేదని డాక్టర్ కె. లక్ష్మన్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ కొనుగోళ్ళ వంటి  అనేక పథకాలలో  అవినీతి జరిగిందని అన్నారు.  అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలపై వత్తిడి తెచ్చి వారిని లొంగ దీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. చేసిన తప్పులను  కప్పి పుచ్చుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వారిప ైవిచారణ జరిపి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మన్ అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు