భగీరథ నల్లా కనెక్షన్ల ఇంటింటి సర్వే పారదర్శకంగా జరగాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

 


భగీరథ నల్లా కనెక్షన్ల ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలని: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.


వరంగల్, 10 జూన్ 2024.

జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ లపై ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. 

సోమవారం  ఎన్ ఐ టి దర్గా రోడ్ లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని, ప్రస్తుతం అందిస్తున్న మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు  సరిపోతుందా...? అధికంగా అవసమనముందా? అనే విషయాలు తెలుసుకునేందుకు సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.

ఆయా గ్రామాలలో ఎంపీడీఒలు, ఏపిఓలు, ఏపిఎం లు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయితీ సెక్రటరీ లు,ఈజీఎస్, సీసీ ఐకేపీ లను సర్వే అధికారులుగా నియమించడం జరిగిందని అన్నారు. 


జిల్లా మొత్తం 625 మంది సిబ్బంది కి శిక్షణ ఇచ్చామని 323 జీపీలు, సుమారు ఇళ్లు 1, 23, 894. ఈ సర్వే ద్వారా జిల్లాలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఎన్ని, నీరు వస్తుందా? లేదా అనే వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి నల్లా కనెక్షన్లు చెక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు మొబైల్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ప్రతీ ఆపరేటర్ రోజుకు 25 నుండి 50 వరకు అప్లికేషన్లు,10 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ సర్వే అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.


అనంతరం జిల్లా నుండి మొబైల్ అప్లికేషన్ పై హైదారాబాద్ లో శిక్షణ పొందిన మాష్టర్ ట్రైనర్ల చే ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొబైల్ అప్లికేషన్ పై వివరించి, సందేహాలను నివృత్తి చేశారు.


 ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈ, ఇంచార్జి డిపిఓ రామిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకట రమణ రెడ్డి, ఎంపిఓ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు