కిట్స్ వరంగల్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వరంగల్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2024 మంగళవారం తో ముగిసాయి.
బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2024 లో విజేతలకు ముఖ్య అతిథి వైస్ ప్రెసిడెంట్ బ్యాట్, డబ్ల్యుడిబిఎ జనరల్ సెక్రటరీ మరియు కిట్స్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా పి.రవీందర్ రెడ్డి బహుమతులు అందజేశారు.
బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT- బ్యాట్)కి అనుబంధంగా ఉన్న వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డబ్ల్యుడిబిఎ) 2023 మే 25-27 లలో మూడు రోజుల పాటు "బాలురు, బాలికలు, పురుషులు మరియు మహిళల కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2024" ను కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) క్యాంపస్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పింగిలి రమేష్ రెడ్డి విజేతలకు బహుమతులు అంద చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడలు దేహ ధారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు.
పట్టుదలతో క్రమ శిక్షణతో ధృడ సంకల్పంతో ముందుకు సాగేందుకు ఆశయ సాదనలో క్రీడలు తోడ్పడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా విచ్చేసిన టాస్క్ ఫోర్స్, ఏసీపీ & జాయింట్ సెక్రటరీ, బ్యాట్ , డా.ఎం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా వర్ధమాన క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చేందుకు బ్యాడ్మింటన్ సంఘం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. గెలవడం మరియు ఓడిపోవడం ముఖ్యం కాదని ఎంత చురుగ్గా పాల్గొన్నామనేది ముఖ్యమని అన్నారు. యువత మొబైల్‌లు, డ్రగ్స్ మరియు మద్యపాన ఉత్పత్తులకు అలవాటు పడటం వంటి చెడు పద్ధతులకు బదులుగా క్రీడామైదానాల్లో గడపాలని అన్నారు.
ఈ సందర్భంగా డబ్ల్యూడీబీఏ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.రమేష్ కుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ ప్రాంతంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మరియు అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు టోర్నమెంట్ వేదికగా మారిదని అన్నారు.
ముందు ముందు క్రీడాకారులు రాష్ట్ర , జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వరంగల్ జిల్లాకు ఖ్యాతి తేవాలని అన్నారు.
రాష్ట్ర మరియు ఉన్నత స్థాయి పోటీ టోర్నమెంట్‌లలో మీ డైనమిక్ ప్రదర్శన ద్వారా వరంగల్
. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టోర్నీలో 230 మంది క్రీడాకారులు పాల్గొన్నారని డాక్టర్ పి రమేష్ రెడ్డి తెలిపారు. ఇక్కడి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాలలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల షడ్యూల్ ను ఆయన వెల్లడించారు.
1. Men & Women - Mancherial - 27th to 30th June 2024
2. U-19 Boys & Girls - Mahabubnagar - 3rd to 6th July 2024
3. U-17 Boys & Girls - KITS Warangal - 23rd to 26th July 2024
4. U-15 Boys & Girls - Medak - 14th to 17th July 2024
5. U-13 Boys & Girls - Hyderabad - 8th to 11th August 2024
6. U-11 Boys & Girls - Nalgonda - 5th to 8th Sept 2024
ఈ కార్యక్రమంలో డబ్ల్యుడిబిఎ కోశాధికారి డి.నాగకిషన్, డబ్ల్యుడిబిఎ ఉపాధ్యక్షులు డా.ఎన్.మోహన్ రావు, డబ్ల్యుడిబిఎ సభ్యులు శ్రీ పి.వెంకటేశ్వరరావు, కెఐటిఎస్‌డబ్ల్యు, ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్, డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఎటిబిటి ప్రసాద్, జి. కిషోర్, భాస్కర్, కృష్ణవేణి, బేబి శైలజ, శ్యామ్, హెడ్, పిఎస్‌డి, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. ప్రభాకరాచారి, 230 మంది క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులతో పాటు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.
---
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box