అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వరంగల్ మాంనూర్ నుండి ఆర్టీవో కార్యాలయం వద్ద గల జ్యోతి భా పూలే తెలంగాణ బిసి బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల వరకు నిర్వహించిన ర్యాలీను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి రవీందర్ లతో కలసి జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా.
ఈ సందర్భంగా డ్రగ్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం జ్యోతి భా పూలే తెలంగాణ బిసి బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో " సాక్ష్యం స్పష్టంగా ఉంది... నివారణ పెట్టుబడి" అనే అంశం పై జరిగిన సమావేశంలో ప్రసంగించిన కలెక్టర్. పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు , తదితరులు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box