సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి..కలెక్టర్ పమేలా సత్పతి


సీజనల్ వ్యాధుల నియంత్రణకు 

చర్యలు తీసుకోవాలి..

పరిశుభ్రతపై ప్రజలకు 

అవగాహన కల్పించాలి..

బయటి ఆహారం తీసుకోవద్దు..

కాచి చల్లార్చిన నీటిని తాగాలి..



జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

సీజనల్ వ్యాధుల నియంత్రణపై 

జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్  సమావేశం 


వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులను నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో శానిటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. దోమల వ్యాప్తిని నివారించాలని, మురికిగుంటల్లో ఆయిల్స్ బాల్స్ వేయాలని సూచించారు. ప్రజలు ఇండ్ల వద్ద పరిశుభ్రత పాటించాలని, బయట ఆహారం తీసుకోవద్దని తెలిపారు. వర్షాకాలంలో తాజా  కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.  ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఎక్కడపడితే అక్కడ నీటిని తాగవద్దని సూచించారు. పాఠశాలల్లో బ్లీచింగ్ పౌడర్ ను అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వ్యర్ధాలను మున్సిపల్ సిబ్బందికి కాకుండా ఏజెన్సీ వారికి అప్పగించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిపిఓ రవీందర్, జడ్పి సిఈఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు, తదితరులు పాల్గొన్నారు. 


ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి..

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు అన్ని రకాల పనులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. పెండింగ్లో పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, మాస్ మీడియా అధికారి రంగారెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్ కిరణ్, కార్యదర్శి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు