బిడ్డను లిక్కర్ కేసు నుండితప్పించేందుకే కెసిఆర్ ఆపరేషన్ ఫాం హవుజ్ కేసు

ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు- రాధాకిషన్ రావు అంతా కక్కేసాడు...


ఫోన్ టాపింగ్ కేసులో మాజి సిఎం కెసిఆర్ చుట్టూ బలమైన సాక్షాలు నమోదు అవుతున్నాయి.  ఫోన్ టాపింగ్  వ్యవహారం అంతా కెసిఆర్ కనుస్నల్లో జరిగినట్లు అనేక ఆధారాలు లభించాయి. పోలీసుల విచారణలో మాజి డిసిపి  రాధా కిషన్ రావు అనేక విషయాలు వెల్లడించారని సమాచారం. 

మీడియా సంస్థల యజమానుల ఫోన్లతో పాటు అనేక మంది ఫేన్లు టాప్ చేసారు. వ్యాపారుల ఫోన్లు కూడ టాప్ చేశారు. స్వంత పార్టి నేతల ఫోన్లు అట్లాగే విప్కష పార్టీల అగ్ర నేతల ఫోన్లు టాప్ చేశారు. ఫోన్ టాపింగ్ లో ఎవరిని వదల్లేదు.

తన కూతురు కవితను లిక్కర్ కేసులో ఇరికించారని ఆమెను బయట పడేయాలంటే ఇందుకు ప్రతిగా బిజెపి ఆగ్ర నేతలను ఏదైనా కేసులో ఇరికించాలని స్వయంగా కెసిఆరే మాస్ట ర్ ప్లాన్ వేసినట్లు రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టులో పేర్కొన్నారని సమాాచారం. 

దాంతో మొయినాబాద్ ఫాం హవుజ్ కేసు మొత్తం కెసిఆర్ కనుసన్నల్లో నడిచింది.  అప్పట్లో కెసిఆరే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి  ఈ కేసు పూర్వాపరాలు వెల్లడించారు. కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి నేతలు పార్టి ఫిరాయింపు కు ప్రోత్సహిస్తున్నారని  బేర సారాలు సాగిస్తున్నారని  ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కు సిఎం కెసిఆర్ స్వయంగా చెబితే ఆయన తమకు ఫోన్ టాపింగ్ కోసం ఆదేశాలు ఇచ్చారని రాదాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్ రావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ గా ఫాం హవుజ్ కేసు నడిపించారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఫోన్ టాపింగ్ కోసం పరికరాలు ఎస్ఐబి కొనుగోలు చేసింది. 

కొల్లాపూర్, అచ్చంపేట, తాండూరు, పినపాక, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు తో డీల్ సెట్ చేసుకునేందుకు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఫాం హవుజ్ కు పిలిపించి సీక్రెట్ గా అమర్చిన సిసి కెమెరాలతో  అన్ని చిత్రీకరించారని అనంతరం పోలీసులు అధికారులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేసారని  రాధాకిషన్ రావు వెల్లిడించారు. 

రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ల పై వత్తిడి తెచ్చి బిఎల్ సంతోష్ రావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లు చెప్పాలని వత్తిడి తెచ్చి అనేక కేసులు నమోదు చేసారని  వారు చెప్పక పోవడంతో కెసు మొత్తం అడ్డం తిరిగింది. బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఢిల్లీ వెల్లినా ఫలితం లేక పోయంది. బిఎల్ సంతోష్ హై కోర్టును ఆశ్రయించడంతో కేసు పూర్తిగా నీరు గారి పోయింది. ఇదంతా కేసిఆర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో జరిగిందని అప్పట్లో బిజెపి నేతలు తీవ్రంగా స్పందించారు. 

మొత్తానికి ఫోన్ టాపింగ్ కేసు పూర్తిగా సిఎం తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిలింగ్ కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని  చేశారనే విషయాలు పోలీసులు రికార్డు చేశారు.

పోన్ టాపింగ్  కేసులో కీలక అధికారి ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయనపై ఇప్పటికే లుక్ ఆవుట్ నోటీసులు జారి అయ్యాయి. ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. 

జూన్ లో కాని జులైలో కాని ఆయన ఇండియాకు తిరిగి రావచ్చని పోలీసుుల భావిస్తున్నారు. ఈ మద్యే ప్రభాకర్ రావు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి వివిరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా అధికారికంగా  తెలియ చేయాలని మెయిల్ పంపమని చెప్పడంతో  ప్రభాకర్ రావు నుండి తదుపరి సమాధానం లబించనట్లు సమాచారం.

మొత్తానికి ఫోన్ టాపింగ్ కేసు పూర్తిగా సిఎం తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని  చేశారనే అభియోగాలు  పోలీసులు రికార్డు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు