నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాలపై అవగాహన పెంచుకొని జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ జిల్లా షి టీం సబ్ ఇన్స్పెక్టర్ కంచి విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ జిల్లా కేంద్రం ఏకశిలా పార్క్ లో సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మహిళలు ఈవ్ టీజింగ్ పై అవగాహన పెంచుకోవాలని,.ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, చినారులు గుడ్ టచ్, బాడ్ టచ్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి పిర్యాదు చేయాలి. అపరిచిత నెంబర్లు, తెలిసిన వారి నుండైనా మహిళలకు ఇబ్బందులకు గురైనప్పుడు, అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ పోలీసు కమీషనర్ వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ నెంబర్ 8712685142, ఎస్.ఐ. నెంబర్ 8712685270 కి పిర్యాదు చేయాలని, పిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థులకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలుకు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏకశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ సోమయ్య, గవర్నర్ వెంకటేశ్వర్ రావు, కోటేశ్వర్ రావు, కమలాకర్ విజయకుమార్, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, కానిస్టేబుల్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box