ఆయన కళా'రే'డు -రే

 


ఆయన కళా'రే'డు..


సత్యజిత్ రే జయంతి 

      02.05.1021

______________________


(*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*)

        9948546286


✍️✍️✍️✍️✍️✍️✍️


ఆయన..

భారతీయ సినిమాకి

శాశ్వత చిరునామా..

ఆయన..

డ్రస్సు..అడ్రస్సు..యశస్సు..

అన్నీ సినిమానే..

ఆ సినిమా ఆయనకి హనీమూనే..

ఆయన సినిమా ప్రేక్షకుడికి 

ఫుల్ మూనే..

ఆ సినిమాకి 

ఆయన హీమానే..!


_*సత్యజిత్ రే..*_

సినిమా ఆయన 

మస్తిష్కంలోనే ఆవిష్కారం

అవుతుంది..

ఆ బుర్రలో సినిమా కొత్త అర్థాలను వెతుక్కుంటుంది..

మామూలు దర్శకులు 

తీసే సినిమా ఈ _*రే*_ తీస్తే 

కళాత్మకం అవుతుంది..

అప్పుడు దాని పేరు *_కళాఖండం.._*

సున్నితమైన 

సామాజిక అంశాలకు 

*_రే సినిమాలు_*

*_ఎక్స్ రేలు...!_*


సృజనాత్మకత రే

ఇంటిపేరు..

కళాత్మకత ఆయన 

సినిమాల తీరు..

వాస్తవికత..ఆయనను 

శిఖరాగ్రానికి చేర్చిన తేరు..

వీటన్నిటి కలబోతగా

సత్యజిత్ తీసిన 

*_ప్రతి సినిమా సజీవంగా_* 

*_ప్రవహించే సెలయేరు...!_*


సినిమాపై ఆసక్తి లేని 

మనిషి చేతిలో సినిమాకి

ఎన్నెన్ని నగిషీలో..

ప్రతి సినిమా ఒక శిల్పి చేతిలో శిల్పంలా..

అవార్డులు ఆయనకు

హంసతూలికా తల్పంలా..

రవీంద్రుని శాంతినికేతనంలో

ప్రాచ్యకళలు 

ఆయన మెలకువలు..

అజంతా ఎల్లోరా అందాలు

ఆయన కథల్లో కువకువలు..

కథ..కళ..రచన..వచన..

సినిమాలోని ప్రతి విభాగం..

సత్యజిత్ చేతిలో పడితే

దానికో వైభోగం..

భారతీయ సినిమాను 

ఆయన చేశాడు బాపు'రే'...

*_ఆయన్ను చేరి పులకించింది_*

*_అంతటి ఆస్కా'రే'.._*

భారతరత్న సైతం

సత్యజిత్ రే ఇంట

హిప్ హిప్ హు'రే'..

సత్యజిత్ రే సినిమా అంటే

ఓ పరంప'రే'..

ఆయన ప్రపంచం

ఆ దర్శక దిగ్గజం 

పేరు చెబితేనే

శిరసు వంచి 

అంటుంది భళా'రే'..!


*_పథేర్ పాంచాలి.._*

తొలి చిత్రమే హుర్రే..

ఒకనాడు సినిమాకి *_అగంతక్.._*

ఎప్పటికీ *_అపరాజితో.._*

భారతీయ సినిమా 

*_కాపురుష్ వో మహారుష్.._*

*ఈ దర్శక మహారుషి..!*


🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు